Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది అనుష్క శర్మ. అందం అభినయంతో ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. తాజాగా తను స్లిమ్ గా కనిపించేందుకు ఎలాంటి డైట్ ఫాలో అవుతుందో వెల్లడించింది.
అనుష్క శర్మ.. పెద్దగా పరియం అవసరం లేని బాలీవుడ్ బ్యూటీ. మరీ ఎక్కువ సినిమాలు చేయకపోయినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం, పెళ్లితో బాగా పాపులర్ అయ్యింది. 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు ఉండే ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందు ఎలా ఉందో, ఇప్పటికీ అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాత ఆమె అందం రెట్టింపు అయిందా అన్నట్లు కనిపిస్తోంది. అయితే, తాను అందంగా అందంగా కనిపించేందుకు చాలా కష్టపడుతున్నట్లు అనుష్క శర్మ తాజాగా వెల్లడించింది. స్లిమ్ గా ఉండేందుకు డైట్, స్కిన్ కేర్, వర్కౌట్ షెడ్యూల్స్ కచ్చితంగా ఫాలో అవుతుందట. అందుకే స్లిమ్ గా కనిపిస్తూ, మెరిసిపోతూ కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ అనుష్క శర్మ ఫిట్ నెస్ కోసం తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం..
అనుష్క శర్మ డైట్ షెడ్యూట్ ఇదే!
అందంగా కనిపించాలంటే డైట్ తప్పనిసరి అంటోంది నటి అనుష్క శర్మ. ఇందుకోసం ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఈ అమ్మడు. భర్త విరాట్ కోహ్లీ తరహాలోనే చిప్స్, చాక్లెట్స్ కు దూరంగా ఉంటుంది. నట్స్, పండ్లతో పాటు ప్రోటీన్ బార్‌లను బాగా తీసుకుంటుంది. ఆరోగ్యంగా ఉంచే డ్రింక్స్ మాత్రమే తాగుతుంది. హోం ఫుడ్ ఎంజాయ్ చేస్తానని చెప్పే అనుష్క.. బయటి ఆహారాన్ని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోదట. ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఇష్టంగా తీసుకుంటానని చెబుతోంది. బ్రేక్ ఫాస్ట్ లో పండ్లు, చియా గింజలు, తాజా పండ్ల రసాలను తీసుకుంటుంది. మార్నింగ్ స్నాక్ లో చీజ్, కొబ్బరి నీళ్లు తాగుతుంది. లంచ్ లో రెండు చపాతీలు, పప్పులు, కూరగాయల సలాడ్ తింటుంది. సాయంత్రం స్నాక్స్ లో పండ్లు, ప్రోటీన్ బార్లు, డిన్నర్ లో బటర్ చికెన్, కూరగాయలతో రోటీస్ తీసుకుంటుంది. నిద్రపోయే సమయంలో ఒక గ్లాసు పాలు తాగుతుంది అనుష్క.
బరువు తగ్గేందుకు అనుష్క చిట్కాలు ఇవే..
అనుష్క శర్మ సరైన ఫిజిక్ మెయింటెన్ చేయడానికి బరువును కంట్రోల్ ఉంచే చిట్కాలను ఫాలో అవుతుంది. తక్కువ పిండి పదార్థాలు, అధిక ప్రొటీన్ల మిశ్రమంగా ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకుంటుంది. ఒకేసారి కాకుండా పలుమార్లు కొంచెం కొంచెంగా ఆహారం తీసుకుంటుంది. ఎక్కువగా పండ్లు, కూరగాయలను తింటుంది. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్లనని అనుష్క చెబుతోంది. రోజుకు రెండు సార్లు యోగా చేయడంతో పాటు బాడీని ఫిట్ గా ఉంచేందుకు ప్రతిరోజూ 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు డ్యాన్స్ చేస్తుంది. వారంలో 3 నుంచి నాలుగు సార్లు వ్యాయామం చేస్తుంది. ఆమె ఫిట్ నెస్ షెడ్యూల్ లో ఎక్కువ భాగం డ్యాన్స్, యోగా, మెడిటేషన్ ఉంటాయి. కార్డియో-వాస్కులర్ కండరాలను టోన్ డ్యాన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇవన్నీ చూస్తే అందంగా కనిపించేందుకు అనుష్క చాలా కష్టపడుతోంది. ఇలాంటి ఆహార, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నాక అందంగా కనిపించక ఏం చేస్తారంటున్నారు నెటిజన్లు.
View this post on Instagram
Read Also: రీ రిలీజ్ కు రెడీ అయిన నితిన్ హిట్ మూవీ, విడుదల ఎప్పుడో తెలుసా?