Anupama Parameswaran : నగ్న ఫోటోలు షేర్ చేస్తూ.. అనుపమ పోస్ట్!
తాజాగా మహిళల శరీరాకృతి, ఆడవారి మీద జరిగే వివక్ష గురించి రాసిన ఓ పోస్ట్ ను అనుపమ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టుకుంది.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అక్కడ 'ప్రేమమ్' సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చారు. 'అ ఆ' సినిమాలో నాగవల్లి పాత్రలో అనుపమ నటన అంత ఈజీగా మర్చిపోలేం. ఆ తరువాత హీరోయిన్ గా ఈమెకి టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమకోసమే' లాంటి సినిమాలు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.
యంగ్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ సాగిస్తోన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వెండితెరపై ఎంత సందడి చేస్తుంటుందో.. సోషల్ మీడియాలో అంత అల్లరి చేస్తుంటుంది అనుపమ. ఫన్నీ వీడియోలను షేర్ చేయడంతో పాటు పాటలు పాడుతూ.. డాన్స్ లు వేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తన సోదరుడితో కలిసి ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. తన మీద ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్స్ వచ్చినా కూడా స్పందిస్తుంటుంది అనుపమ.
అప్పుడప్పుడు సామాజిక సమస్యల మీద కూడా మాట్లాడుతుంటుంది. తాజాగా మహిళల శరీరాకృతి, ఆడవారి మీద జరిగే వివక్ష గురించి రాసిన ఓ పోస్ట్ ను అనుపమ తన ఇన్స్టాగ్రామ్ లో స్టోరీగా పెట్టుకుంది. మహిళలు లావుగా ఉన్నా.. సన్నగా ఉన్నా.. నల్లగా ఉన్నా.. తెల్లగా ఉన్నా.. ఇలా ఎలా ఉన్నా సరే వారిపై విమర్శలు చేస్తుంటారు. మహిళలు ఇలానే ఉండాలంటూ నిర్ధేశిస్తుంటారు. లావుగా ఉంటేనేమో జీరో సైజ్ లేదని.. జీరో సైజ్ ఉంటేనేమో మరీ బక్కపలచగా ఉందంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఎక్కువగా తినొద్దని కొందరు.. మరీ తక్కువ తింటే ఎలా అని మరికొందరు సలహాలు ఇస్తూనే ఉంటారని.. ఆంక్షలు పెడతారంటూ వచ్చిన పోస్ట్ లను అనుపమ షేర్ చేసింది.
ఇలాంటి పోస్ట్ లను అనుపమ షేర్ చేయడంతో మహిళలపై వివక్షను తను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పకనే చెప్పింది అనుపమ. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. వివక్షపూరితమైన కామెంట్స్ చేసే వారిని మేల్కొలిపే విధంగా ఉన్న ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనుపమ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి '18 పేజీలు' కాగా.. రెండోది 'కార్తికేయ 2'. ఈ రెండు సినిమాల్లో కూడా నిఖిలే హీరోగా నటిస్తున్నాడు. వీటితో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక తమిళంలో 'తల్లిపోగాతె' అనే సినిమాలో నటిస్తోంది.