News
News
వీడియోలు ఆటలు
X

Anni Manchi Sakunamule: ఈ వేసవికి చల్లని చిరుగాలిలాంటి మూవీ - తిరుపతిలో 'అన్నీ మంచి శకునములే’ టీమ్ సందడి

నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంతోష్ శోభన్, మాలవిక నాయర్ జంటగా నటించిన ఈ మూవీలో ప్రమోషన్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి

FOLLOW US: 
Share:

Anni Manchi Sakunamule : డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం 'అన్నీ మంచి శకునములే'. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్ నిర్మించారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

సరికొత్త సినిమాతో ప్రేక్షకుల మదిని దోచుకునే విధంగా 'అన్నీ మంచి శకునములే' సినిమాను రూపొందించామని  డైరెక్టర్ నందినీ రెడ్డి అన్నారు. 'అన్నీ మంచి శకునములే' సినిమా ప్రేమ కథా చిత్రంగా, కుటుంబ సభ్యులతో కలిసి చూడగలిగే చిత్రంగా తెరకెక్కించామని, వైరెటీ స్టోరీతో  ప్రేక్షకుల మదిని దోచుకునే విధంగా సీన్స్ ను మలిచామని చెప్పారు. దానికి తోడు ఈ సినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులు నటించడం మూవీకి మరో ప్లస్ పాయింటన్నారు. ఈ మూవీలో ఆహ్లాదకరమైన సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని స్పందించారు.

ఇక ఈ సినిమాకు సంగీతం అందించిన మిక్కీ జై మేయర్.. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, నరేష్, గౌతమి కన్నడ యాక్టర్ అంజు, వాసుకి, రావు రమేష్, వెన్నెల‌కిషోర్ లు నటించారని చెప్పారు. మూవీలోని పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ‌ సినిమా ప్రమోషన్ కోసం‌ విజయవాడ, గుంటూరుతో పాటు తిరుపతి, చిత్తూరు, కర్నూలులో పాల్గొన్నానని చెప్పారు.

అనంతరం మూవీ ప్రమోషన్లో పాల్గొన్న  హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. చాలా సార్లు తిరుమలకు నడుచు‌కుంటూ వచ్చానని, తను నటించిన సినిమా టీంతో కలిసి మొదటిసారి తిరుపతికి రావడం చాలా మంచి శకునముగా భావిస్తున్నట్లు తెలిపారు. డైరెక్టర్ నందినీ నేతృత్వంలో వచ్చిన ఈ అద్భుతమైన సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్న శోభన్... ఈ‌సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తాను రీసెంట్ గా నటించిన 'పలానా అబ్బాయి పలానా అమ్మాయి' చిత్రం విడుదలైందని, దాంతో పాటు 'అన్ని మంచి శకునములే' సినిమాలో చాలా సీనియర్ నటులతో కలిసి నటించడం చాలా సంతోషం కలిగించిందని హీరోయిన్ మాలవిక నాయర్ చెప్పారు. షావుకారమ్మతో కలిసి రెండోసారి నటించానని ఆమె తెలిపారు.

ఈసారి వేసవికి చల్లని చిరుగాలి అంటూ ఊరిస్తున్న చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ సినిమాలోని పాటలు, మూవీ పోస్టర్ సినిమా పేరుకు తగ్గట్టే ఆహ్లాదంగా ఉండడంతో సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఏప్రిల్‌ 20న మీట్‌ రిషి– ఆర్య ఇన్‌ ఇటలీ’ అంటూ ఓ వీడియో ద్వారా మూవీ రిలీజ్ డేట్ ను చిత్ర బృందం అనౌన్స్ చేసింది. మే18న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వెల్లడించింది. ఫీల్‌ గుడ్‌ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం విభిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరి వ్యక్తుల మధ్య అందమైన బంధం ఎలా ఏర్పడిందని చెప్పడమే ఈ మూవీ కథాంశంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఈ మూవీలోని రెండు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read 'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి

Published at : 20 Apr 2023 11:49 AM (IST) Tags: Santosh Shoban Summer Malvika Nair Nandini Reddy Anni Manchi Sakunamule Swapna Promotions Anni Manchi Sakunamule

సంబంధిత కథనాలు

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi Relationship : ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ లావణ్య పెట్టిన క్యాప్షన్ వెనుక ఇంత కథ ఉందా?

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

Lavanya Tripathi: అల్లు అరవింద్ మాటలను నిజం చేసిన లావణ్య, వైరల్ అవుతున్న ఓల్డ్ వీడియో!

టాప్ స్టోరీస్

Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?

Telangana Poltics :  తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా  చక్కదిద్దుతుంది ?

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం - దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Devineni Uma : అహంకారం వల్లే ఓడిపోయాం -  దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు !

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

Saroor Nagar Murder Case: పోలీసులనే భయపెట్టిన అప్సర హత్య కేసు నిందితుడు సాయికృష్ణ- పరువు కోసం చంపేసినట్టు స్టేట్‌మెంట్

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?

కాంగ్రెస్ సంచలన నిర్ణయం! స్కూల్ సిలబస్ నుంచి RSS వ్యవస్థాపకుడి పాఠం తొలగింపు?