Vishnupriya: సమంత పాటకు విష్ణు ప్రియ ఆట.. ఊ అంటారా? ఉఊ అంటారా?
‘పుష్ప’లో సమంతా డ్యాన్స్ చూడటానికి ముందే.. యాంకర్ విష్ణు ప్రియా డ్యాన్స్ చూసేయండి. ఎందుకంటే.. ఆ తర్వాత ‘ఊ అంటారో.. ఉఊ అంటారో’!!
![Vishnupriya: సమంత పాటకు విష్ణు ప్రియ ఆట.. ఊ అంటారా? ఉఊ అంటారా? Anchor Vishnupriya Sets Instagram on Fire With Oo Antava Song's Hot Dance Moves Vishnupriya: సమంత పాటకు విష్ణు ప్రియ ఆట.. ఊ అంటారా? ఉఊ అంటారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/17/81b505e996f3a229fc97a9db918b8d8e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
‘పుష్ప: ద రైజింగ్’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఊర మాస్ అవతారం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. ఇందులో సమంత స్పెషల్ సాంగ్ చూసి అంతా నోరెళ్ల బెడుతున్నారు. ‘ఉ అంటారా.. ఉఊ అంటారా..’ అంటూ అందాల సామ్ అందాలు విందు చేస్తుంటే.. థియేటర్లలో ఒకటే ఈలలు.. అరుపులు. ఎంతో గ‘మత్తు’గా సాగే ఈపాట.. యూట్యూబ్‌లో భలే ట్రెండవ్వుతోంది. ఈ నేపథ్యంలో యాంకర్ విష్ణు ప్రియా.. ఈ పాటకు స్టెప్పులేస్తూ.. సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.
ఆ పాటలో సమంత తరహాలోనే పొట్టి దుస్తులతో.. విష్ణు ప్రియా డ్యాన్స్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్లు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ వీడియో చూసి సమంతా ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారోనని భయపడిందో ఏమో.. ఫాలోవర్లు కామెంట్స్ పెట్టకుండా జాగ్రత్తపడింది. గంటల వ్యవధిలోనే విష్ణు డ్యాన్స్‌కు 47 వేల మందికి పైగా ‘‘ఊ కొట్టారు’’. అదేనండి.. లైక్ చేశారు. మీరు కూడా ఆ సాంగ్ చూసి.. ‘‘ఊ అంటారా? ఉఊ అంటారో’’ అనేది మీ ఇష్టం.
View this post on Instagram
View this post on Instagram
Also Read: సిరి ఓట్లకు గండి కొట్టిన ‘బిగ్ బాస్’.. ఆమె ఫేక్ ఎలిమినేషన్‌తో షన్ను ‘లెక్క’ మారుతుందా?
Also Read: అందాల రాక్షసి మనసూ అందమైనదే... బర్త్‌డే రోజు అనాథలతో!
Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు సపోర్ట్‌గా మహిళా మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)