Vishnupriya FB Hacked: విష్ణుప్రియ ఫేస్‌బుక్ మళ్లీ హ్యాక్ - అశ్లీల పోస్టులతో సైబర్ నేరగాళ్లు అరాచకం
యాంకర్ విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ మళ్లీ హ్యాకయ్యింది. అశ్లీల పోస్టులతో సైబర్ నేరగాళ్లు విష్ణు ప్రియను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
సెలబ్రిటీలకు హ్యాకర్ల ముప్పు సాధారణమే. ఒక్కసారి వారి అకౌంట్ హ్యాకయ్యిందంటే.. మళ్లీ దాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు చాలా టైమ్ పడుతుంది. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోతుంది. కొందరు సైబర్ నేరగాళ్లు సెలబ్రిటీల డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తారు. మరికొందరు.. వారి పేరు మీద వివాదాస్పద పోస్టులు పెడుతుంటారు. కొందరు అశ్లీల చిత్రాలు లేదా వీడియోలు పోస్టు చేసి ముప్పుతిప్పలు పెడతారు. ఈ విషయం తెలియని నెటిజనులు సెలబ్రిటీలే ఆ పోస్టులు పెడుతున్నారేమో అని భావిస్తారు. ఇటీవల యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హ్యాకర్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను హ్యాక్ చేసి ఆమె ఫొటోలు, వీడియోలు మొత్తం డిలీట్ చేసేశారు. కొద్ది రోజుల కిందట యాంకర్ విష్ణు ప్రియ ఫేస్‌బుక్‌ను కూడా ఎవరో హ్యాక్ చేశారు. దాన్ని సరిచేసిన కొద్ది రోజుల్లో మరోసారి సైబర్ నేరగాళ్లు ఆమె అకౌంట్‌పై అటాక్ చేశారు. ఫేస్‌బుక్ స్టేటస్‌లో అశ్లీల ఫొటోలు పోస్టు చేస్తున్నారు. ఆమె అకౌంట్లో సంబంధంలేని పోస్టులు పెడుతున్నారు.
సైబర్ నేరగాళ్ల పనే..
యాంకర్ విష్ణు ప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కావడంపై ‘ఏబీపీ దేశం’ ఆమె టీమ్‌ను సంప్రదించింది. దీనిపై వారు స్పందిస్తూ.. ఇప్పుడు ఆమె అకౌంట్లో పోస్టవుతున్న వీడియోలు, ఫొటోలకు విష్ణు ప్రియకు సంబంధం లేదని వెల్లడించారు. మొదట్లో ఆమె ఖాతాలో అశ్లీల వీడియోలు చూసి షాక్ అయ్యామని, దీంతో తన ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించి సమస్యను పరిష్కరించాలని ఫేస్ బుక్ ను రిక్వెస్ట్ చేశామన్నారు. అయితే దీనిపై ఫేస్ బుక్ ఇప్పటికీ స్పందించలేదని, దీంతో ఆమె తనను అన్ ఫాలో చేయాలని ఫాలోవర్స్ ను కోరిందని చెప్పారు. ఇటీవల మళ్ళీ తన ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించామని నెల రోజుల్లో ఇలా జరగడం ఇది రెండో సారి అని చెప్పారు. ప్రస్తుతం తాము ఫేస్ బుక్ తో సంప్రదించి సమస్యను సాల్వ్ చేసే పనిలో ఉన్నామని చెప్పుకొచ్చారు.
విష్ణు ప్రియ కెరీర్ ప్రారంభంలో సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించింది. తర్వాత సుడిగాలి సుధీర్ తో కలసి 'పోవే పోరా' ప్రోగ్రాంలో యాంకర్ గా చేసింది. ఈ షో తో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షో లలో పాల్గొంటూ బిజీ బిజీ గా ఉంటోంది. విష్ణు ప్రియ సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది. అందం, అభినయం తో ఆకట్టుకునే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటుంది. దీంతో ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇదే ప్రస్తుతం ఆమెను తల పట్టుకునేలా చేసింది.
ముప్పుతిప్పలు పెడుతున్న హ్యాకర్లు
విష్ణు ప్రియ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండటంతో హ్యాకర్స్ దృష్టి ఈమె పై పడింది. ఆమె ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆమె ప్రమేయం లేకుండా అశ్లీల చిత్రాలు, వీడియోలను ఆమె ఖాతాలో షేర్ చేయడంతో విష్ణు ప్రియపై విమర్శలు మొదలయ్యాయి. ఫాలోయింగ్ కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ కామెంట్లు కూడా చేసేశారు నెటిజన్స్. అయితే సమస్యను గుర్తించిన ఆమె పరిష్కరించాలని ఫేస్ బుక్ ను కోరినా.. ఇప్పటి వరకూ రెస్పాన్స్ లేదు. అయితే ఆమె ఖాతా నుంచి మళ్ళీ అలాంటి పోస్ట్ లు అప్లోడ్ అవ్వడంతో ప్రస్తుతం ఈ ఫేస్ బుక్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
Also Read: అంచనాలు పెంచేస్తోన్న ‘హిట్ 2’ ట్రైలర్ - అడివి శేష్‌ను పరిగెత్తించిన కోడి బుర్ర కిల్లర్