Amitabh Bachchan: ఆ చిన్నారి అలా గులాబీలు అమ్మడం రోజూ చూస్తున్నా, అందుకే అలా చేశా: అమితాబ్ బచ్చన్
ఇటీవల అమితాబ్ బచ్చన్ రాసిన ఓ బ్లాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన బిగ్ బి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఏం రాశారంటే...
Amitabh Bachchan: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. అంతలా ఆయన సినిమాలు ప్రేక్షకులపై ప్రభావం చూపుతాయి. ఆయన కూడా అభిమానుల పట్ల అంతే గౌరవంగా ఉంటారు. అమితాబ్ సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గానే ఉంటారు. ఎప్పటికప్పుడు తన విశేషాలను తన అభిమానులతో పంచుకుంటారు. ఒక్కోసారి పెద్ద పెద్ద పోస్టులు రాసుకొస్తారు. అవి చూసి అమితాబ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అమితాబ్ ఓ నోట్ ను తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర గులాబీ పూలు అమ్ముతోన్న ఓ చిన్నారి గురించి ఎమోషనల్ గా రాశారు అమితాబ్.
గులాబీలు అమ్ముతున్న చిన్నారి గురించి ఎమోషనల్ పోస్ట్
అమితాబ్ బచ్చన్ తనకు అనిపించిన విషయాలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే ఈ మధ్య ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారాయన. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర భారీ వర్షంలో పూలు అమ్ముతున్న ఓ చిన్నారి గురించి తన బ్లాగ్ లో ప్రస్తావించారు. ఆ చిన్నారి ఆమె కుటుంబాన్ని పోషించడం కోసం పూలు ఎలా అమ్ముతుందో రాసుకొచ్చారు. తాను చాలా కాలం నుంచి ఆ చిన్నారి బీచ్ రోడ్ లో అమాయకమైన ముఖంతో గులాబీలు అమ్మడం చూస్తున్నానని అన్నారు. పూలు కొనుక్కోవాల్సిందిగా కార్ల దగ్గరకు వెళ్లి ఎలా అభ్యర్థిస్తుందో చెప్పారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరూ కూడా ఆ చిన్నారి నుంచి పూలు తీసుకోవడం లేదని చెప్పారు. ఇది చాలా కాలంగా చూస్తున్నానని రాసుకొచ్చారు. అయితే తాను ఈసారి భారీ వర్షంలో కూడా పూలు అమ్మడం చూశానని అన్నారు. అందుకే కారు ఆపి ఆ చిన్నారిని పిలిచానని, ఆమె తన దగ్గరకు రావడానికి సంకోచించిందని అన్నారు. కానీ తాను పిలిచిన తర్వాత దగ్గరకు వచ్చిందని, తాను ఆమె చేతిలో ఉన్న గులాబీలు ఎంతో అడగకుండా డబ్బులు ఇచ్చానని చెప్పారు. అప్పుడు తన ముఖంలో ఏదో తెలియని ఆనందం చూశానని అన్నారు.
ఈ మొత్తం జరిగిన సంఘటనను ఉద్వేగభరితమైన వ్యాఖ్యాలతో వివరిస్తూ రాసుకొచ్చారు అమితాబ్. ఇంక తన బ్లాగ్ లో చెప్పడానికి ఇంకేమీ లేదని, కానీ తన కుటుంబానికి ఆహారం ఇవ్వడానికి ఆ చిన్నారి కష్టపడుతున్న తీరు తనను కదిలించిందని అన్నారు. ఆ చిన్నారి అమయాకమైన ముఖం తనకు అలా గుర్తిండిపోయిందని చెప్పారు. అమితాబ్ చేసిన ఈ ఎమోషనల్ పోస్ట్ చూసి ఆయన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ‘‘మీరు నిజంగా గ్రేట్ సార్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎనిమిది పదుల వయసులోనూ అదే స్పీడ్
ఇక అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. ఎనిమిది పదుల వయసులోనూ ఇప్పటికీ ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన చివరిగా ‘ఉంచై’లో కనిపించారు. ఇందులో అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ, డానీ డెంజోంగ్పా, పరిణీతి చోప్రా కూడా నటించారు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తోన్న ‘ప్రాజెక్ట్ కె’ లో కీలక పాత్రలో కనిపించనున్నారు అమితాబ్. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా ఇందులో ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా నటించారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు. బచ్చన్ త్వరలో రిభు దాస్ గుప్తా ‘సెక్షన్ 84’లో కూడా కనిపించనున్నారు.
Also Read: హీరో సూర్య ఆ డైలాగ్ తీయించేశాడు, అది పెద్ద మిస్టేక్: ఉదయనిధి స్టాలిన్