News
News
X

Ashika Ranganath - Amigos : నంద‌మూరి నాయికగా ఆషిక - 'అమిగోస్'తో తెలుగుకు కన్నడ భామ

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'అమిగోస్'. ఇందులో కన్నడ భామ ఆషికా రంగనాథ్ హీరోయిన్. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

FOLLOW US: 
Share:

తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేసే కథానాయకులలో  నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ఒకరు. ఆయన కంటూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. 'బింబిసార' సినిమాతో భారీ కమర్షియల్ సక్సెస్ కూడా ఆయన అందుకున్నారు. 

'బింబిసార' ముందు వరకు ఒక లెక్క... ఆ సినిమా తర్వాత మరో లెక్క! ఇప్పుడు కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరిగింది. ప్రేక్షకులలో ఆయన ఇమేజ్, రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న సినిమా 'అమిగోస్'. టైటిల్ స్పానిష్ వర్డ్. మన స్నేహితుని గురించి చెప్పడానికి సూహించే పదం. దాన్ని టైటిల్‌గా పెట్ట‌టం వెనుక ఉన్న కార‌ణం ఏంటి? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులు అందరిలో ఉంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... సినిమాలో హీరోయిన్ లుక్ విడుదల చేశారు. 

కళ్యాణ్ రామ్ జంటగా కన్నడ భామ
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ జోడిగా కన్నడ భామ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నటించారు. ఆమెకు తొలి తెలుగు చిత్రమిది. ఆల్రెడీ కన్నడలో కొన్ని సినిమాలు చేశారు. 'అమిగోస్'లో ఇషిక పాత్రలో ఆషిక నటించారని చిత్ర బృందం పేర్కొంది. ఈ రోజు ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

View this post on Instagram
 
A post shared by Mythri Movie Makers (@mythriofficial)

మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో కళ్యాణ్ రామ్
'అమిగోస్'లో క‌ళ్యాణ్ రామ్ మూడు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నార‌నే విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా దర్శక నిర్మాతలు రివీల్ చేశారు. హీరోగా కళ్యాణ్ రామ్ 19వ చిత్రమిది. రీసెంట్‌గా విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 

ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి హీరోగా నటించిన చిత్రమిది. దీనికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలు. ఫిబ్రవరి 10న సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ''చిత్ర నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జరుగుతున్నాయి. వాటితో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 10, 2023న భారీ స్థాయిలో విడుదల చేస్తాం'' అని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా విడుదల తర్వాత 'బింబిసార 2' పనులు మొదలు కావచ్చని సమాచారం. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందట.

Also Read : బాలకృష్ణ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ - ముగ్గురు హీరోయిన్లు ఏం చెప్పారంటే?
  
'అమిగోస్' చిత్రానికి కూర్పు : త‌మ్మిరాజు, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ : అవినాష్ కొల్ల‌, నృత్యాలు : శోభి, ఫైట్ మాస్ట‌ర్స్: వెంక‌ట్, రామ్ కిష‌న్‌, పాట‌లు:  'స్వ‌ర్గీయ' శ్రీ వేటూరి, రామ‌జోగ‌య్య శాస్త్రి, రెహ‌మాన్‌, ఛాయాగ్రహణం : ఎస్‌. సౌంద‌ర్ రాజ‌న్, సి.ఇ.ఓ :  చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : హ‌రి తుమ్మ‌ల‌, సంగీతం : జిబ్రాన్. 

Also Read : పవన్ కళ్యాణ్ 'వీరమల్లు' కోసం హిందీ హీరో వచ్చాడోచ్

Published at : 24 Dec 2022 12:05 PM (IST) Tags: Nandamuri Kalyan Ram Ashika Ranganath Amigos Movie Telugu Kannada Heroines Telugu Movies

సంబంధిత కథనాలు

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

Aakhil Sarthak - BB jodi: ‘బీబీ జోడీ’ ఎలిమినేషన్‌పై అఖిల్ ఆగ్రహం? నా నొప్పి తెలియాలంటూ వీడియో!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?

Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?