Dheeraj Mogilineni: వెంకటేష్ మహా రిస్క్ తీసుకోలేదు, మేం తీసుకుంటున్నాం - నిర్మాత ధీరజ్ ధీరజ్ మొగిలినేని
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘ సినిమాను వెంకటేష్ మహా నిర్మించాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో ఆయన తప్పుకున్నారని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. వాస్తవ ఘటనలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు వెల్లడించారు.
Dheeraj Mogilineni About Ambajipeta Marriage Band Movie: సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు‘. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ‘దొరసాని‘, ‘ఏబీసీడీ‘, ‘ఊర్వశివో రాక్షసివో‘, ‘బేబి‘ లాంటి హిట్ చిత్రాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ధీరజ్ మొగిలినేని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
వెంకటేష్ మహా రిస్క్ తీసుకోవాలి అనుకోలేదు- ధీరజ్
వాస్తవానికి ఈ సినిమాకు దర్శకుడు వెంకటేష్ మహా నిర్మాతగా వ్యవహరించాల్సి ఉన్నా, కొన్ని కారణాలతో తప్పుకున్నట్లు ధీరజ్ మొగిలినేని తెలిపారు. “దుశ్యంత్ వెంకటేష్ మహా దగ్గర ‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిత్రాలకు పని చేశాడు. వెంకటేష్ ను గురువుగా భావిస్తాడు. ఈ సినిమా కథను ఫస్ట్ దుశ్యంత్ వెంకటేష్ మహాకే చెప్పాడు. వెంకటేష్ మహా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ టైమ్ లో రిస్క్ ఎందుకని అనుకున్నారు. ఈ కథ మేము కూడా విన్నాం. మాకు బాగా నచ్చింది. వెంకటేష్ మహాకు మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని చెప్పాం. ఆయన సరేనన్నారు. వెంకటేష్ మహాను ప్రెజెంటర్ గా ఉంచి మేము నిర్మించాం” అని తెలిపారు.
వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’
లాక్ డౌన్ సమయంలోనే ఈ సినిమా కథను దుశ్యంత్ తనకు చెప్పినట్లు ధీరజ్ వెల్లడించారు. “లాక్ డౌన్ సమయంలో డైరెక్టర్ దుశ్యంత్ నాకు ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా కథను డైలాగ్ వెర్షన్ తో సహా చెప్పాడు. తన జీవితంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ తో రాసుకున్నాడు. స్టోరీ చాలా బాగుందని అనిపించింది. దుశ్యంత్ చెప్పిన కథలోని ఎలిమెంట్స్ సహజంగా ఉండి నన్ను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కథ ఎలా సహజంగా ఉందో అలాగే కాస్టింగ్, లొకేషన్స్ ఉండాలని ప్లానింగ్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైమ్ తీసుకుని సినిమా షూటింగ్ బిగిన్ చేశాం. ట్రైలర్ చూసి మా సినిమాలో కులాల గురించి డిస్కషన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. కానీ, అలాంటిదేమీ ఉండదు. ఊరిలో జరిగే కథ కాబట్టి సహజంగా పెద్ద కులాలు, చిన్న కులాలు ఉంటాయి. అంతే గానీ ఒక కులాన్ని కించపరచడం గానీ మరో కులాన్ని గొప్పగా చూపించడం గానీ చేయలేదు. మా సినిమా ద్వారా ఎలాంటి సందేశం చెప్పడం లేదు. ఇలా ఉండాలని సూచించడం లేదు. ఒక ప్రాంతంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ను అలాగే సినిమాగా తెరకెక్కించి చూపిస్తున్నాం. ఇది మంచీ ఇది చెడు..ఇలా మారిపోండి అని ప్రేక్షకులకు చెప్పాలని అనుకోవడం లేదు. ఈ సినిమా ఒక ప్రేమ కథ మాత్రమే కాదు. ఇందులో లవ్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే” అని వివరించారు.
Also Read: ‘రామాయణ్‘లో హనుమంతుడిగా సన్నీడియోల్, రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
సుహాస్, శివాని నటన అద్భుతం- ధీరజ్
ఈ సినిమా కోసం సహాస్ ఎంతో కమిట్ మెంట్ తో కష్టపడి నటించాడని ధీరజ్ తెలిపారు. సహాస్ పర్ ఫార్మెన్స్ ఎంత బాగుంటుందో స్క్రీన్ మీద చూస్తారని చెప్పారు. మేము కూడా అతన్ని ఒక సీరియస్ సబ్జెక్ట్ లోనే చూపించాలని అనుకున్నట్లు వివరించారు. ఈ సినిమా కోసం తను రెండుసార్లు గుండు చేసుకున్నాడని చెప్పారు.ఆయన కమిట్ మెంట్ కు సర్ ప్రైజ్ అయినట్లు ధీరజ్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శివాని అద్భుతంగా చేసిందన్నారు. ఈ సినిమాను చూసి అల్లు అరవింద్ సంతోషంతో తమను హగ్ చేసుకున్నారని వివరించారు. అటు ప్రస్తుతం రశ్మిక మందన్నతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ చేస్తున్నట్లు వివరించిన ఆయన ఈ ఏడాదే విడుదల చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మూవీలో ‘పుష్ప’ ఫేం జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, శరణ్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Read Also: తొమ్మిది మంది బాలీవుడ్ స్టార్స్‌తో సచిన్ టెండూల్కర్ యాడ్ - డబ్బుల కోసం కాదు, మరి ఎందుకో తెలుసా?