Pushpa: పుష్పరాజ్ ఈజ్ బ్యాక్ - రేపే పూజా కార్యక్రమాలు!
'పుష్ప ది రూల్' సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు మేకర్లు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి రీచ్ దక్కింది. సినిమాలో బన్నీ మేనరిజమ్స్ ని ఇమిటేట్ చేస్తూ కొన్ని లక్షల రీల్స్ వచ్చాయి. క్రికెట్ మ్యాచ్ లలో, కిక్ బాక్సింగ్ లో 'తగ్గేదేలే' అంటూ రచ్చ చేశారు సెలబ్రిటీలు. 'పుష్ప' ఇంత పెద్ద హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. ఆ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' రాబోతుంది.
మొదటి పార్ట్ కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పార్ట్ 2 రాసుకుంటున్నారు దర్శకుడు సుకుమార్. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. అందుకే సెట్స్ పైకి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించారు మేకర్లు. రేపే ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.
#PushpaRaj is back!
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2022
This time to Rule 😎#PushpaTheRule Pooja Ceremony tomorrow💥
India's most anticipated sequel is going to be BIGGER ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika @ThisIsDSP @aryasukku pic.twitter.com/791FhTOlC5
'పుష్ప' సినిమాకి క్రేజీ డీల్:
'పుష్ప' పార్ట్ 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి కొన్ని సంస్థలు. 'పుష్ప'తో డీల్ క్లోజ్ చేయాలని చూస్తున్నాయి. రీసెంట్ గా ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట ఓ సంస్థ. మైత్రి మూవీస్ బ్యానర్ ఈ డీల్ పై ఆసక్తి చూపిస్తున్నప్పటికీ.. బన్నీ మాత్రం వద్దని చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పారట. దీంతో ప్రస్తుతానికి ఈ క్రేజీ డీల్ ను పక్కన పెట్టేశారు. 'పుష్ప' పార్ట్ 1 సమయంలో మాత్రం డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులను ముందే అమ్మేశారు. ఈసారి మాత్రం అలా చేయడం లేదు.
సుకుమార్ కి బన్నీ డెడ్ లైన్:
దర్శకుడు సుకుమార్ కి ఈ సినిమా విషయంలో బన్నీ డెడ్ లైన్ విధించినట్లు తెలుస్తోంది. వందరోజుల్లో షూటింగ్ ను పూర్తి చేయాలని చెప్పాడట బన్నీ. 2022 దసరా నాటికి 'పుష్ప' పార్ట్ 2ని విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం దొరకలేదు. దీంతో ఆ ఎఫెక్ట్ సీజీ వర్క్ పై పడింది. సినిమాలో గ్రాఫిక్స్ సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి కామెంట్స్ కి తావివ్వకుండా త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. గ్రాఫిక్స్ అండ్ మిగిలిన వర్క్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని చూస్తున్నారు.
Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మతిరిగే రియాక్షన్
Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!