By: ABP Desam | Updated at : 03 Dec 2022 08:33 PM (IST)
అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు రష్యాలో ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'పుష్ప'. ఈ నెల 8న రష్యన్ భాషలో విడుదల కానుంది. అందుకని... దర్శకుడు సుకుమార్, శ్రీవల్లి పాత్రలో నటించిన హీరోయిన్ రష్మికా మందన్న (Rashmika Mandanna), ఇతర యూనిట్ సభ్యులతో కలిసి ప్రమోట్ చేయడానికి వెళ్ళారు.
రష్యాలో 'పుష్ప 2' కూడా!
Pushpa 2 Release In Russia : ప్రస్తుతం రష్యాలో 'పుష్ప' ప్రచారంపై దృష్టి పెట్టిన యూనిట్, రష్యన్‌లో 'పుష్ప 2' కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. 'పుష్ప' విడుదలకు ముందు అక్కడి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఈ నిర్ణయం తీసుకున్నారట. అయితే... 'పుష్ప' సినిమా విషయంలో చేసిన పొరపాటు 'పుష్ప 2'కి చేయకూడదని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు.
సేమ్ డే రిలీజ్ చేయాలని...
'పుష్ప 2'ను ఇండియాలో ఏ రోజు అయితే విడుదల చేస్తారో... అదే రోజున రష్యాలో కూడా విడుదల చేయాలని డిసైడ్ అయినట్టు చిత్ర నిర్మాతలలో ఒకరైన వై. రవి శంకర్ పేర్కొన్నారు. ఒక్క రష్యా మాత్రమే కాదు... 'పుష్ప 2'ను ఇతర విదేశీ భాషల్లో కూడా అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి రష్యా ఫైనలైజ్ చేశామని, ఇతర దేశాలలో విడుదల విషయమై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.
Also Read : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్
మళ్ళీ క్రిస్మస్ సీజన్‌లో...
'పుష్ప' సినిమా డిసెంబర్‌లో విడుదలైంది. క్రిస్మస్ సీజన్ కంటే ఓ వారం ముందు థియేటర్లలోకి వచ్చింది. ఈసారి కూడా అదే విధంగా రావాలని అల్లు అర్జున్ అండ్ కో ప్లాన్ చేస్తున్నారట. ఈసారి 'పుష్ప 2'ను క్రిస్మస్ వీకెండ్ థియేటర్లలోకి తీసుకు వచ్చేలా సన్నాహాలు జరుగుతున్నాయట.
బ్యాంకాక్‌లో రెండు వారాలు...
'పుష్ప 2' షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించడంతో రెండు పార్ట్ కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేశారు. అది కంప్లీట్ కావడంతో వచ్చే వారం సెట్స్ మీదకు వెళుతున్నారు. బ్యాంకాక్‌లో రెండు వారాలు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ అడవుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఆల్రెడీ దర్శకుడు సుకుమార్ బ్యాంకాక్ వెళ్లారని తెలిసింది. 30 శాతం సినిమా బ్యాంకాక్ అడవుల్లో షూటింగ్ చేయనున్నారు. ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన అల్లు అర్జున్, అక్కడ నుంచి నేరుగా బ్యాంకాక్ వెళతారట. అదీ ప్లాన్!
ఫహాద్ ఫాజిల్ (Fahad Fazil), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), సునీల్ తదితరులు 'పుష్ప 2'లో కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులోనూ రష్మిక హీరోయిన్. 'పుష్ప' విడుదలైన తర్వాత 'తగ్గేదే లే' పాపులర్ అయ్యింది. ఇప్పుడు 'అస్సలు తగ్గేదే లే' అంటున్నారు అల్లు అర్జున్. 'ఊర్వశివో రాక్షసివో' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ''ఇప్పుడు నన్ను అందరూ పుష్ప గురించి అడుగుతున్నారు. వారికి చిన్న అప్ డేట్ ఇస్తా... 'పుష్ప 1' తగ్గేదే లే అయితే 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. నేనూ ఈ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను'' అని బన్నీ చెప్పారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు కూడా అదే మాట అంటున్నారట.
‘వసుమతి’కి పెళ్లైపోయింది - బాలీవుడ్ హీరో సిద్ధార్థ్‌తో ఘనంగా కియారా వెడ్డింగ్, ఒక్కరోజుకు అంత ఖర్చా?
Aditi Gautam marriage: వైభవంగా ‘నేనింతే’ హీరోయిన్ వివాహం, వరుడు ఎవరో తెలుసా?
Vinaro Bhagyamu Vishnu Katha Trailer: ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ట్రైలర్ - కాన్సెప్ట్ కొత్తగా ఉందే!
Vijay Deverakonda: పాములు, పులులతో విజయ్ దేవరకొండ ఆటలు - జాగ్రత్త అన్నా అంటున్న ఫ్యాన్స్
Rakhi Sawant: రాఖీ సావంత్ భర్త అరెస్ట్ - తన తల్లి మరణానికి కారణం అతడేనని ఆరోపణలు
Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !
Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!
YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన
Khammam Politics : సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ ! ఇద్దరి కామన్ డైలాగ్‌లో "దమ్ము" హైలెట్ !