Allu Arjun: 18 ఏళ్ల తర్వాత తన తొలి హీరోయిన్‌ను కలిసిన బన్నీ, ఫొటోలు వైరల్
18 ఏళ్ల క్రితం గంగోత్రి సినిమాలో నటించిన అల్లు అర్జున్, అదితి అగర్వాల్.. మళ్లీ కలిశారు. న్యూయార్క్ లో మీట్ అయిన వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాాలో వైరల్ అవుతున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఓ రేంజిలో హిట్ కొట్టింది. టాలీవుడ్ నుంచి మొదలుకొని బాలీవుడ్ వరకు బాక్సాఫీస్ లను షేక్ చేసింది. అదే ఊపులో పుష్ప- ‘ది రూల్’కు రెడీ అవుతున్నారు ఈ అల్లువారి అబ్బాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ పొడక్షన్ పనులు నడుస్తున్నాయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుంది.
ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు అల్లు అర్జున్. వెకేషన్స్ కు వెళ్లి సరదాగా గడుపుతారు. ఆ ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తన భార్య స్నేహతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం బన్నీ భార్య, పిల్లలతో కలిసి న్యూయార్క్ ఉన్నారు.
ఈ సందర్భంగా బన్నీ న్యూయార్క్‌లో నివసిస్తున్న తన తొలి సినిమా ‘గంగోత్రి’ హీరోయిన్ అదితి అగర్వాల్ ను కలిశారు. దివంగత ఆర్తి అగర్వాల్ చెల్లిగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అల్లు అర్జున్ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18 ఏళ్ల కిందట నా డియరెస్ట్ అల్లు అర్జున్, నా స్వీట్ ఫ్రెండ్, ఫస్ట్ కో స్టార్, బిగ్ సూపర్ స్టార్, గంగోత్రి డేస్ గుర్తుకు వస్తున్నాయంటూ ఆయనతో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఇద్దరు బ్లాక్ డ్రెస్సుల్లో అదిరిపోయేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అక్క ఆర్తి అగర్వాల్ సినిమా పరిశ్రమలో సక్సెస్ కావడంతో.. ఆమె సిస్టర్ గా సినిమా పరిశ్రమలోకి వచ్చింది అదితి అగర్వాల్. కానీ ఆర్తి అగర్వాల్ మాదిరిగా హీరోయిన్ గా రాణించలేకపోయింది. అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయిన గంగోత్రి సినిమాతో ఆమె హీరోయిన్ జనాల ముందుకు వచ్చింది. తొలి సినిమానే మంచి విజయాన్ని అందుకోవడంతో అదితికి పలు ఆఫర్లు వచ్చాయి. ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్థి, కొడుకు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమాలు విజయం సాధించలేదు. ఆ తర్వాత తను నెమ్మదిగా వెండితెరకు దూరం అవుతూ వచ్చింది.
సినిమాలు లేక.. చేసిన సినిమాలు విజయం సాధించక చాలా ఇబ్బందులు పడింది. అటు అక్క ఆర్తి అగర్వాల్ కు సైతం డౌన్ ఫాల్ మొదలయ్యింది. అదే సమయంలో ప్రేప కారణంగా ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ నేపథ్యంలో వారి ఫ్యామిలీ చాలా ఇబ్బందులు పడింది. అదితి 2016లో ‘లవ్‌హై యార్ ఆక్సెప్ట్ ఇట్’ అనే సినిమాలో నటించింది. ఇదే ఆమె చివరి సినిమా. ఆ తర్వాత తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడింది. 35 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.
సినిమాలకు దూరం అయినా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది అదితి అగర్వాల్. అక్క ఆర్తితో పాటు తన కుటుంబ సభ్యుల ఫోటోలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం లైఫ్ ను హ్యాపీగా గడుపుతుంది. తాజాగా అల్లు అర్జున్ తో ఆమె దిగిన ఫోటోలను షేర్ చేయడంతో.. మళ్లీ తను సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతుందేమోనని భావిస్తున్నారు.
Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు