Pushpa: అలా ఉండే బన్నీని.. ఇలా మార్చేశారు, ‘పుష్ప’ మేకోవర్ వీడియో చూశారా?
'పుష్ప' సినిమాలో బన్నీ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. అతడి మాస్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన సినిమా 'పుష్ప'. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన 'పుష్ప' ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.365 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఒక్క బాలీవుడ్ లోనే ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ సినిమాలో బన్నీ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. అతడి మాస్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే దీని వెనుక చాలా కష్టముందని చెబుతోంది చిత్రబృందం. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇందులో 'పుష్ప'గా బన్నీ మేకోవర్ ని చూపించారు. 'The fire you know, the transformation you don't' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ ఆర్టిస్ట్ ల కష్టం తెలుస్తోందని కొందరు.. 'ఊ అంటావా మావా' సాంగ్ కి ముందు బన్నీ ఇదే డ్రెస్ లో కనిపిస్తారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటించింది. అలానే సునీల్, అనసూయ, అజయ్ ఘోష్ లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు. ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లపై తెరకెక్కించిన ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
View this post on Instagram