Ugram: ‘ఉగ్రం’ రిలీజ్ డేట్ వచ్చేసింది - అల్లరోడు థియేటర్లలో పలకరించేది ఎప్పుడంటే?
‘అల్లరి’ నరేష్ ‘ఉగ్రం’ మే 5వ తేదీన విడుదల కానుంది.
Ugram Update: ‘అల్లరి’ నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఉగ్రం’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ‘అల్లరి’ నరేష్ ఈ సినిమాలో కనిపించనున్నారు. దీని విడుదల తేదీని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. మే 5వ తేదీన ‘ఉగ్రం’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు మూడు వారాలు దీన్ని వాయిదా వేశారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
I have won your hearts over many summers, but this summer you will witness my UGRA ROOPAM ❤️🔥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/KwciqBmgkW
— Allari Naresh (@allarinaresh) April 3, 2023
'నాంది' తర్వాత హీరో 'అల్లరి' నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలిసి చేస్తున్న సినిమా 'ఉగ్రం'. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా నిర్మిస్తున్నది కూడా వీళ్ళే. హీరోగా నరేష్ 60వ చిత్రమిది. ఈ రోజు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) టీజర్ విడుదల చేశారు.
'ఉగ్రం' టీజర్ చూస్తే... స్టార్టింగులో నరేష్ పోలీస్ అనేది రివీల్ చేశారు. అడవిలో రౌడీలను చిత్తకొడుతూ కనిపించారు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి... మనిషిని పైకి ఎత్తు కింద పడేసే షాట్ బావుంది. నరేష్ సీరియస్ ఎక్స్ప్రెషన్ కూడా సూపర్. 'ఒంటి మీద యూనిఫామ్ ఉందనే కదా ఈ పొగరు. ఈ రోజు నీదే. నాకు ఓ రోజు వస్తుంది' అని విలన్ ఆవేశపడితే... 'నాది కాని రోజు కూడా నేను ఇలాగే నిలబడతా. అర్థమైందా!' అంటూ నరేష్ వెరీ కూల్ కౌంటర్ ఇచ్చారు.
'ఉగ్రం' కథ ఏంటి? అనేది కూడా టీజర్ ద్వారా దర్శక, నిర్మాతలు హింట్ ఇచ్చారు. పెళ్ళైన పోలీస్ అధికారిగా సినిమాలో నరేష్ కనిపించనున్నారు. ఆయనకు ఓ పాప కూడా ఉందని చూపించారు. ఫ్యామిలీని టచ్ చేయడంతో ఉగ్ర రూపుడైన హీరో ఏం చేశారు? అనేది కథగా తెలుస్తోంది. ఫ్యామిలీ లాస్ తర్వాత కనిపించే సన్నివేశాల కోసం నరేష్ లుక్ కూడా చేంజ్ చేశారు. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం బావుంది. వేసవిలో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
'నాంది' సినిమాలో చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించే అండర్ ట్రయిల్ ఖైదీగా నరేష్ కనిపిస్తే... 'ఉగ్రం'లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే ఇరగదీశాడనే చెప్పాలి. నటుడిగా కూడా ఉగ్రరూపం చూపించారు.
ఈ సినిమాలో 'అల్లరి' నరేష్ భార్యగా, కథానాయిక మిర్నా నటించారు. ఈ చిత్రానికి కథ తూము వెంకట్ అందించగా... 'అబ్బూరి' రవి మాటలు రాశారు. ఇంకా ఈ చిత్రానికి ఎడిటర్ : చోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి, సంగీతం : శ్రీచరణ్ పాకాల, నిర్మాణ సంస్థ : షైన్ స్క్రీన్స్, నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది, దర్శకత్వం : విజయ్ కనకమేడల.