Alia Bhatt Ranbir Kapoor Wedding: అలియా-రణబీర్ పెళ్లిపై రాబిన్ భట్ కామెంట్స్
రాబిన్ భట్ తో పాటు అలియాకు అన్నయ్య వరసయ్యే రాహుల్ భట్ కూడా అలియా పెళ్లి గురించి మాట్లాడారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియాభట్ పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. నిజానికి వీరి పెళ్లి 2020లోనే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం కుదిరిందని సమాచారం. ఏప్రిల్ 17న ఈ జంట పెళ్లి చేసుకోబోతుందట. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు.
తాజాగా ఈ విషయాన్ని అలియాభట్ మావయ్య, ప్రముఖ రైటర్ రాబిన్ భట్ కన్ఫర్మ్ చేశారు. అలియా పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని.. నా మేనకోడలు, రణబీర్ హ్యాపీగా ఉండాలని కోరుకున్నారు. అలానే అలియా కపూర్ వంశానికి చెందిన పురాతన, వారసత్వ నివాసం ఆర్కే హౌస్‌లో జరగబోతుందని చెప్పారు. అదే బంగ్లాలో రణబీర్ తండ్రి రిషి కపూర్ పెళ్లి కూడా జరిగిందని.. అప్పట్లో దానికి కూడా ఎటెండ్ అయినట్లు చెప్పారు రాబిన్ భట్.
రాబిన్ భట్ తో పాటు అలియాకు అన్నయ్య వరసయ్యే రాహుల్ భట్ కూడా అలియా పెళ్లి గురించి మాట్లాడారు. అలియా పెళ్లి ఇన్విటేషన్ అందిందని.. పెళ్లికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అలియా పెళ్లి డాన్స్, సాంగ్స్ తో అదరగొడతానని అన్నారు. తను జిమ్ ఇన్స్ట్రక్టర్ గా పని చేస్తున్నానని.. అలియా పెళ్లిలో బాడీగార్డ్ అయిపోతా అంటూ జోక్ చేశారు.
Also Read: 'శర్మాజీ నమ్‌కీన్' రివ్యూ: రిషి కపూర్ ఆఖరి సినిమా - వయసుతో పనేంటి?
Also Read: చిరంజీవితో సినిమా చేయలేదని ఇప్పటికీ బాధపడుతున్నా - ఉపేంద్ర
View this post on Instagram