అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Alia Bhatt: తెలుగులో అలియా పోస్ట్, 'గంగూబాయ్' తెలుగు డైలాగ్స్ ప్రోమో రిలీజ్
'రహీం లాలా.. 3 రోజుల్లో కలుద్దాం!' అంటూ అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది అలియాభట్.
![Alia Bhatt: తెలుగులో అలియా పోస్ట్, 'గంగూబాయ్' తెలుగు డైలాగ్స్ ప్రోమో రిలీజ్ Alia Bhatt's Telugu Post on Gangubai Movie Alia Bhatt: తెలుగులో అలియా పోస్ట్, 'గంగూబాయ్' తెలుగు డైలాగ్స్ ప్రోమో రిలీజ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/22/c78aadb77b628d4cddb1b6f14f6699d4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'గంగూబాయ్' తెలుగు డైలాగ్స్ ప్రోమో రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గంగూబాయి కతియావాడి'. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. అజయ్ దేవగన్, హ్యూమా ఖురేషి ఇందులో కీలకపాత్రల్లో నటించారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటుంది అలియా. ఇటీవల తెలుగు మీడియాను ముంబైకి పిలిపించుకొని అక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో ఓ పోస్ట్ పెట్టింది. 'రహీం లాలా.. 3 రోజుల్లో కలుద్దాం!' అంటూ అజయ్ దేవగన్ పాత్రకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. సినిమాలో అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఈ వీడియో చూస్తుంటే అర్ధమవుతుంది. 'నాలుగువేల మంది స్త్రీల భవిష్యత్తు.. గంగు ఈ పోరాటం నువ్ గెలిచే తీరాలి' అని అజయ్ దేవగన్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది.
కామాటిపుర అనే ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉండే వేశ్య గంగూబాయి ఒక రాజకీయ నాయకురాలిగా ఎలా ఎదిగిందనేదే ఈ సినిమా. SLB భన్సాలీ ప్రొడక్షన్స్ అండ్ జయంతిలాల్ గడాస్ పెన్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మేకర్స్. మరేం జరుగుతుందో చూడాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
పాలిటిక్స్
హైదరాబాద్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)