Alia On Ranbir, NTR: బాయ్‌ఫ్రెండ్‌లో బెస్ట్ క్వాలిటీస్ - ఎన్టీఆర్ కామెంట్‌పై ఆలియా రియాక్షన్!
'బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవర్' అంటూ రణ్‌బీర్ కపూర్ గురించి ఇటీవల ఆలియా భట్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అతడిలో బెస్ట్ క్వాలిటీస్ గురించి, ఎన్టీఆర్ తమపై చేసిన కామెంట్ గురించి ఆలియా భట్ స్పందించారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఆ ప్రేమను రహస్యంగా ఉంచాలని అనుకోలేదు. ఆలియా నటించిన 'గంగూబాయి కతియావాడి' సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ట్రైలర్ విడుదలైంది. అందులో ఆమె నమస్కారం పెట్టినట్టు రణ్‌బీర్ నమస్కరిస్తే... 'బెస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవర్' అంటూ ఆలియా పేర్కొన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'రణ్‌బీర్‌ను బెస్ట్ బాయ్‌ఫ్రెండ్‌గా మార్చే అతడిలో మూడు లక్షణాలు ఏవైనా?' అని ప్రశ్నించగా... "హి ఈజ్ లవ్లీ. బెస్ట్ లిజనర్... చెప్పేది చాలా ఓపిగ్గా వింటాడు. బాగా అర్థం చేసుకుంటాడు. వెరీ ఫన్నీ. ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తాడు" అని ఆలియా సమాధానం ఇచ్చారు.
ఆలియాను 'బన్ మస్కా'గా ఎన్టీఆర్ అభివర్ణించారు. దానిపై మీ స్పందన ఏంటి? అని ఆలియాను అడగ్గా... "బాగా చెప్పాడు. నా పేరు ఆలియా. నా ముద్దు పేరు ఆలు. ఆలు అందరికి చెరువ అవుతుంది" అని చెప్పారు. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయని, ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయడం తనకు ఇష్టమని ఆలియా భట్ అన్నారు. ఎన్టీఆర్ చాలా టాలెంటెడ్ అని, పెద్ద స్టార్ అయినప్పటికీ... డౌన్ టు ఎర్త్ ఉంటాడని పొగడ్తల వర్షం కురిపించారు.
Also Read: యంగ్ హీరోలకు షాక్ ఇచ్చిన పవన్ కల్యాణ్!
Also Read: రాజమండ్రిలో ప్రజలకు రామ్ చరణ్ 15 ప్రొడక్షన్ హౌస్ స్వీట్ వార్నింగ్
View this post on Instagram