Alia Bhatt: కరీనా బాటలో ఆలియా, బాయ్‌కాట్ ట్రెండ్‌పై టంగ్ స్లిప్ - ‘బ్రహ్మాస్త్ర’పై ట్రోల్స్
బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ మీద నెటిజన్లు ఓ రేంజిలో విరుచుకుపడుతున్నారు. ఇష్టంలేకపోతే చూడొద్దంటూ టంగ్ స్లిప్ అయిన ఈ అమ్మడు తాజాగా మూవీ బ్రహ్మాస్తను బ్లాక్ బస్టర్ ఫ్లాప్ చేయాలంటున్నారు..
హిందీ సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బాయ్ కాట్ దుమారం చెలరేగుతోంది. యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం మీద జోరుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ మరణానికి కరణ్ జోహార్ లాంటి దర్శకనిర్మాతలతో పాటు కొన్ని కుటుంబాలు కారణం అంటూ ఆరోపణలు వచ్చాయి. ఆయన మృతి పట్ల కనీసం బాలీవుడ్ స్టార్స్ సంతాపం కూడా చెప్పలేదని మండిపడ్డారు నెటిజన్లు. దీనికి వ్యతిరేకంగా బాలీవుడ్ మొత్తాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. అప్పుడే బాయ్ కాట్ ఉద్యమానికి తెరలేపారు. నెమ్మదిగా ఈ ట్రెండ్ దావానంలా విస్తరించింది.
తాజాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా.. విడుదల సందర్భంగా బాయ్ కాట్ ఉద్యమం ఓ రేంజిలో నడిచింది. ఈ దెబ్బకు అమీర్ ఖాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డది. జనాలు థియేటర్లలోకి అడుగు పెట్టకపోవడంతో వందలాది షోలు క్యాన్సిల్ అయ్యాయి. సినిమా నిర్మాతలు ఘోరంగా నష్టపోయారు. అదే సమయంలో ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కరీనా కపూర్ ఇష్టం లేకపోతే చూడటం మానేయండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాటలను సీరియస్ గా తీసుకున్న సినీ లవర్.. ఓ రేంజిలో సమాధానం చెప్పారు. ఆ తర్వాత తప్పుగా మాట్లాడానని ఆమె చెప్పినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. అప్పటికే సినిమాకు జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ సైతం ఇదే రకమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై జోరుగా ట్రోలింగ్ నడుస్తోంది.
తాజా ఈ ముద్దుగుమ్మ ఓ మ్యాగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో నెపోటిజం, బాయ్ కాట్ ట్రెండ్ మీద స్పందించింది. ‘‘ఫలనా కుటుంబంలో పుట్టాలని ఎవరూ కోరుకోరు. తానూ అలా కోరుకోలేదు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుడితే.. తొలి సినిమా వరకే అది ఉపయోగపడుతుంది. అసలు ఆ కుటుంబంలో పుట్టడమే తప్పంటే ఎలా? మీకు నేను ఇష్టం లేకపోతే చూడకండి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు. ఆలియా నటించిన తర్వాతి సినిమాలు ఏవీ చూడొద్దంటూ పోస్టులు పెడుతున్నారు. “ఆలియా కోరిక మేరకు బ్రహ్మాస్త్ర సినిమాను రూ.500 కోట్ల ఫ్లాప్ బస్టర్ చేద్దాం. మనం వాళ్లకు జస్ట్ టికెట్ల లాంటి వాళ్లం. వాళ్లకు మన డబ్బులు మాత్రమే కావాలి. మనం అవసరం లేదు” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ఉద్యమం జోరుగా కొనసాగుతుంది. ఆలియా మాటలతో ఆ ప్రభాతం ఆమె తాజా మూవీ బ్రహ్మాస్త్ర మీద గట్టిగా పడే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తం మూడు భాగాల్లో వస్తుంది. అందులో భాగంగా ఫస్ట్ పార్ట్ ‘శివ’ను సెప్టెంబరులో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఇందులో రణ్‌బీర్, అలియా, అమితాబ్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తంగా బ్రహ్మాస్త్ర రూ.500 కోట్ల ప్రాజెక్టు. ఈ సినిమా తొలి పార్ట్ విడుదల నేపథ్యంలో ఆలియా చేసిన కామెంట్స్ సినిమా యూనిట్ కు కొత్త చిక్కులను తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ లోని తాజా పరిస్థితులను చూడకుండా.. ఆమె అడ్డగోలుగా మాట్లాడటంపై పలువురు సినీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : 'లైగర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారో చూడండి
Also Read : ఎవరు ఆపుతారో చూద్దాం - విజయ్ దేవరకొండ
Congratulations, Next Kareena hui hai.. pic.twitter.com/2qG4jSgKBd
— Lala 🇮🇳 (@FabulasGuy) August 22, 2022