News
News
X

Akshay Kumar Home Tour: ముంబైలోని అక్షయ్ కుమార్ ఇల్లు చూస్తే, వావ్ అనాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఇంటికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చక్కటి పచ్చదనం, ఆకట్టుకునే పెయింటింగ్స్, అద్భుతమైన కళాఖండాలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

FOLLOW US: 
Share:

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారి తన అభిమానుల కోసం ముంబైలోని చూపించారు. త్వరలో ప్రారంభించబోయే దుస్తుల బ్రాండ్ గురించి మాట్లాడే వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో నీలి రంగు స్వెట్‌ షర్ట్, మ్యాచింగ్ ప్యాంటు, తెలుపు స్నీకర్లను ధరించి కనిపించారు అక్షయ్. గార్డెన్ లో నుంచి నడుచుకుంటూ వస్తుండగా ఈ వీడియో మొదలువుతుంది. విశాలమైన హాల్ లోకి వెళ్లడానికి ముందు తలుపు ద్వారం దగ్గర మూలకు పెద్ద వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. వీడియో ప్రారంభంలో “ఇది నా ఇంట్లో జరుగుతున్న మొదటి ఇంటర్వ్యూ. నేను ఎప్పుడూ ఇంట్లో ఇంటర్వ్యూ ఇవ్వలేదు” అని అక్షయ్ చెప్పారు. గార్డెన్ నుంచి అక్షయ్ నేరుగా లివింగ్ రూమ్ లోకి వెళ్లారు. అక్కడంతా వాల్ పెయింటింగ్స్, విగ్రహాలతో భలే ఆహ్లాదకరంగా ఉంది. గది మధ్యలో ఆకుపచ్చ, బంగారు రంగులో బెడ్స్ ఉన్నాయి. ఒక సోఫా దగ్గర రంగుల కళాఖండం ఆకట్టుకుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అక్షయ్ ఇల్లు భూలోకంలో కట్టిన ఇంధ్రభవనంలా ఉంది.

View this post on Instagram
 
A post shared by Akshay Kumar (@akshaykumar)

ఫోర్స్ IX పేరు పెట్టడానికి కారణం ఏంటంటే?

అక్షయ్ దుస్తుల బ్రాండ్ గురించి మాట్లాడుకుంటూ, హాల్ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు.  గది మధ్యలో ఒక అద్దాల గోడ ప్రక్కన ఒక మంచం ఉంది. మంచం మీద అనేక మావ్, ఆకుపచ్చ, క్రీమ్ రంగు కుషన్లు ఉన్నాయి. గాజు పేన్‌కి అడ్డంగా ఆకుపచ్చ తెరలు ఏర్పాటు చేశారు. ప్రకాశవంతంగా మెరిసిపోతున్న గదిలో బంగారు అంచులతో గ్లాస్ వార్డ్రోబ్ కూడా ఉంది. దానికి సమీపంలోని రాక్‌పై అనేక దుస్తులను వేలాడదీశారు. తన బ్రాండ్, ఫోర్స్ IX వెనుక ఉన్న పేరు గురించి అక్షయ్ పలు విషయాలు వెల్లడించారు. " మా నాన్న ఆర్మీలో పని చేశారు. 9న నా పుట్టిన రోజు, నా అదృష్ట సంఖ్య కూడా. తొమ్మిది సంఖ్య అనేది ధీరత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి నేను దానిని కలిపాను. ఫోర్స్ IX  అని పేరు పెట్టాను"అంటూ వివరించారు. అక్షయ్ కుమార్,  ట్వింకిల్ ఖన్నాను వివాహం చేసుకున్నారు.  జనవరి 17, 2001న వీరి పెళ్లి జరిగింది. వారికి ప్రస్తుతం కుమారుడు ఆరవ్ భాటియా, కుమార్తె నితారా భాటియా ఉన్నారు.

సినిమాల్లో అక్షయ్ బిజీ బిజీ

ఆయన సినిమాల గురించి చూస్తే, మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో ‘వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్‌’ సినిమా తెరెక్కుతోంది. ఇందులో అక్షయ్‌  ఛత్రపతి శివాజీ మహారాజ్‌ గా కనిపించనున్నారు. ఇది అక్షయ్ తొలి మరాఠీ చిత్రం. వసీమ్ ఖురేషి నిర్మించిన ‘వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’, మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో దీపావళికి విడుదల కానుంది. అటు కామెడీ ఎంటర్ టైనర్ ‘సెల్ఫీ’ మూవీలోనూ నటిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, డయానా పెంటీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ‘గూర్ఖా’ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఇటీవల జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి యాక్షన్-అడ్వెంచర్ మూవీ ‘రామ్ సేతు’లో కనిపించారు.

Read Also: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

Published at : 09 Dec 2022 01:01 PM (IST) Tags: akshay kumar Akshay Kumar Mumbai home Akshay Kumar Home Tour

సంబంధిత కథనాలు

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Thalapathy 67 Update: ‘దళపతి 67‘ నుంచి అదిరిపోయే అప్ డేట్, కీ రోల్‌లో సంజయ్ దత్, హీరోయిన్‌గా త్రిష

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Urfi Javed On Kangana: ‘పఠాన్’పై ముద్దుగుమ్మల ఫైట్ - నీలో స్వచ్ఛతా, దైవత్వం ఉన్నాయంటూ ఉర్ఫీపై కంగనా కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Nagababu On Jabardasth: వారిని నేను రమ్మనలేదు, ఎవరి రిస్క్ వాళ్లదే: ‘జబర్దస్త్’ రి-ఎంట్రీపై నాగబాబు కామెంట్స్

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

Janaki Kalaganledu Fame Priyanka: 'జానకి కలగనలేదు' సీరియల్ ఫేమ్ జానకి కొత్త ఇల్లు చూశారా?

టాప్ స్టోరీస్

Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

Etala Vs Kousik Reddy :  ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ -  పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం

Dhanbad Fire Accident: జార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం