Akkineni Cousins : ఒకే ఫ్రేమ్లో అక్కినేని కజిన్స్- వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో!
Akkineni Family : టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కజిన్స్ అంతా కనిపించారు. స్మైలింగ్ ఫేస్ తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Akkineni Cousins In One Frame: సినిమా పరిశ్రమలోకి మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ మాదిరిగానే అక్కినేని ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు అడుగు పెట్టారు. వీరిలో కొందరు కొంత మంది మంచి హిట్ సినిమాలతో ఆకట్టుకోగా.. మరికొంత మంది అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అక్కినేని నాగార్జున తర్వాత వచ్చిన హీరోలలో స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్లు ఎవరూ లేరనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ, సినిమాలు చేస్తూనే, సాలిడ్ హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు.
ఒకే ఫ్రేమ్ లో అక్కినేని కజిన్స్- ఫోటో షేర్ చేసిన సుశాంత్
కాసేపు అక్కినేని యంగ్ జెనరేషన్ హీరోల సినిమాల గురించి పక్కన పెడితే, సండే వేళ సుశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతోంది. హాలీడే వేళ అందరూ కలిసి ఒకేచోట చేరి సరదాగా గడుపుతూ ఫోటోకు ఫోజులిచ్చారు. కజిన్స్ కనెక్ట్ అంటూ అక్కినేని హీరో సుశాంత్ ఈ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటోలో అక్కినేని కజిన్స్ అంతా కనిపించారు. నాగ చైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సుప్రియతో పాటు మరికొంతమంది కజిన్స్ ఉన్నారు. అక్కినేని ఫ్యామిలీకి చెందిన కజిన్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. అక్కినేని అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అక్కినేని కజిన్స్ పిక్
నిజానికి అక్కినేని కజిన్స్ లో కొంత మంది సినిమా పరిశ్రమలో కొనసాగుతుండగా, మరికొంత మంది వ్యాపారాల్లో రాణిస్తున్నారు. రకరకాల వ్యాపారాలు రన్ చేస్తున్నారు. సండే వేళ అందరూ తమ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అందరూ కలిసి ఆనందంగా గడపడం సంతోషకరం అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
View this post on Instagram
‘తండేల్’ సినిమా చేస్తున్న అక్కినేని నాగ చైతన్య
నాగ చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నాడు. ‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత నాగ చైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా ఇది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 20, 2024న విడుదల కాబోతోంది. ఈ సినిమను బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చేపలు పట్టే యువకుడిగా నాగ చైతన్య కనిపించనున్నాడు. శ్రీకాకుళం జాలర్లు గుజరాత్ సమీపంలో పాక్ నేవీకి చిక్కిన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య గతంలో ఎన్నడూ లేనంత మాస్ క్యారెక్టర్ తో అలరించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
Read Also: నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా