By: ABP Desam | Updated at : 04 Feb 2023 02:31 PM (IST)
'ఏజెంట్'లో అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'ఏజెంట్' (Agent Movie). ఇది ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుంది? తొలుత గత ఏడాది ఆగస్టు 12న విడుదల చేయాలనుకున్నారు. అయితే, కుదరలేదు. తర్వాత సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా అనౌన్స్ చేసింది. అయితే, అప్పుడు కూడా సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరి, ఎప్పుడు వస్తుంది? అంటే... ఈ ఏడాది వేసవి వేసవిలో అని వినపడుతోంది.
ఏప్రిల్ 28న 'ఏజెంట్' విడుదల
వేసవిలో 'ఏజెంట్' ప్రేక్షకులు ముందుకు రావడం గ్యారెంటీ! ఈ ఏడాది ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యారట. త్వరలో ఆ మేరకు అధికారిక ప్రకటన రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. విడుదల తేదీతో పాటు టీజర్ కూడా విడుదల చేశారు.
ఇప్పుడు కొత్త టీజర్ విడుదల చేశారు. అందులో అఖిల్ లుక్ వైల్డ్ గా ఉంది. ''నీ పేరు ఏంటో చెప్పు? పోలీస్ ఆ? రా? ఈ నెట్వర్క్ లోకి నిన్ను ఎవడు పంపాడురా?'' అని విలన్ అడిగితే... ''ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపాడు బే'' అని అఖిల్ పొగరుతో చెప్పారు. 'పేరు చెప్పు సాలే' అంటే 'వైల్డ్ సాలే బోల్' అని అనడం మరీ వైల్డ్ గా ఉంది. హిప్ హాప్ తమిళ అందించిన నేపథ్య సంగీతం టీజర్ లో హైలైట్.
యాక్షన్ & అఖిల్ ప్యాక్డ్ బాడీ!
'ఏజెంట్'పై అక్కినేని అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ ఆరు నెలల క్రితమే విడుదల అయ్యింది. అందులో మలయాళ స్టార్ మమ్ముట్టి, అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య... అందరినీ చూపించారు.
అఖిల్ అక్కినేనిని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేసే అధికారిగా 'ఏజెంట్'లో మమ్ముట్టి కనిపించనున్నారు. 'అతడిని పట్టుకోవడం కుదరదా?' అనే ప్రశ్న ఆయన ముందుకు వచ్చినప్పుడు... ''ఎటువంటి ఆధారాలు, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ లేకుండా చేస్తున్నాడు'' అని సమాధానం చెబుతారు. అత్యంత ప్రమాదకరమైన దేశభక్తుడిగా అఖిల్ కనిపించనున్నారు. 'ఏజెంట్' కోసం అఖిల్ అక్కినేని ప్యాక్డ్ బాడీ చేశారు. సిక్స్ ప్యాక్ కాదు... ఆయన ఎయిట్ ప్యాక్ చేశారు. ఆల్రెడీ ఆయన స్టిల్స్, ముఖ్యంగా టీజర్ లో గన్ షూట్ చేసిన స్టైల్ వైరల్ అవుతోంది.
స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న 'ఏజెంట్' హీరోగా అఖిల్‌కు 5వ సినిమా. ఇందులో పాత్ర కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు తొలి చిత్రమిది.
ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. 'సైరా' హిందీలో కూడా విడుదల కావడంతో అక్కడి ప్రేక్షకులు కొంత మందికి ఆయన తెలుసు. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా'లో నాగ చైతన్య నటించడం, 'బ్రహ్మాస్త్ర'తో నాగార్జున విజయం అందుకోవడం... అక్కినేని హీరోగా అఖిల్ అక్కడి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాగూల్ హెరియన్ ధారుమాన్, ఎడిటర్: నవీన్ నూలీ, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, పత్తి దీపారెడ్డి.
Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?
Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!
Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!
Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!
Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?