అన్వేషించండి

Aishwaryaa Rajinikanth: రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ, పోలీసులకు ఫిర్యాదు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంతో ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె తెయనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన ఇంట్లో ఉన్న బంగారు, వజ్రాభరణాలు చోరీకు గురైనట్లు గుర్తించిన ఆమె తెయనాంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నివాసంలో ఉంచిన బంగారం, అలాగే ఇతర విలువైన వస్తువులు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో తెలిపింది. అందులో 60 సవర్ల బంగారం, వజ్రాభరణాలు కనిపించడంలేదని వాటి విలువ సుమారు 3.60 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొంది. అయితే వాటి విలువ అంత కంటే ఎక్కువ ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఆ ఆభరణాలు ధరించినట్టు పోలీసులకు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఐశ్వర్య ప్రస్తుతం ‘లాల్ సలాం’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటోంది. ఈ మూవీ కోసం ఆమె తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో లేకపోవడాన్ని గమనించే ఈ పని చేసుంటారని భావిస్తున్నారు. ఐశ్వర్య తన ఇంటి లాకర్ లో ఆ వస్తువులు ఉంచినట్టు కొంత మంది పని వాళ్లకి తెలుసని ఫిర్యాదు కాపీ బట్టి తెలుస్తోంది. పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తన ఇంట్లో పనిచేసే ముగ్గురు వ్యక్తులే ఈ పని చేసినట్లుగా ఐశ్వర్య అనుమానం వ్యక్తం చేస్తోంది.

ఆ ఆభరణాలను తాను గతంలో రెండు మూడు చోట్లకు మార్చినట్టు పేర్కొంది ఐశ్వర్య. 2021లో ఆ లాకర్ ను సెయింట్ మేరీస్ లో తన అపార్ట్మెంట్ లో ఉందని, తర్వాత తన మాజీ భర్త ధనుష్ ఇంటికి మార్చానని, తర్వాత 2021 సెప్టెంబర్ లో తిరిగి తన అపార్ట్మెంట్ కు మార్చినట్టు చెప్పింది. 2022 ఏప్రిల్‌లో తన తండ్రి రజినీకాంత్ పోస్ గార్డెన్ ఇంటికి మార్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది ఐశ్వర్య. అయితే ఆ లాకర్ కీస్ మాత్రం తన అపార్ట్మెంట్ లోనే ఉండేవని ఆ విషయం తన ఇంట్లో పనిచేసే కొంతమందికి తెలుసని చెప్పింది. ఫిబ్రవరి 18న లాకర్ తెరచి చూస్తే తన ఆభరణాల్లో కొన్ని మిస్ అయినట్టు గుర్తించానని తెలిపింది. డైమండ్ సెట్స్, పురాతన బంగారం పీసులు, నవరత్న సెట్స్, గాజులు పోయిన వాటిల్లో ఉన్నాయని పేర్కొంది. తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్ ల పై అనుమానం వ్యక్తం చేసింది ఐశ్వర్య. 

ఇక ఐశ్వర్య చాలా ఏళ్ల తర్వాత మళ్లీ దర్శకురాలిగా ‘లాల్ సలాం’ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇందులో రజనీకాంత్ కూడా ఓ గెస్ట్ పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఐశ్వర్య మొదటి సారిగా తన తండ్రి రజనీకాంత్ ను డైరెక్ట్ చేయనుంది. దీంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ మూవీకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు మేకర్స్.  

Read Also: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget