అన్వేషించండి

Aishwarya Rai: అనంత్ అంబానీ పెళ్లిలో ఎమోషనల్ సీన్ - దీపికను హగ్ చేసుకుని కంటతడి పెట్టిన ఐశ్వర్య

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో అరుదైన సన్నివేశం అందరినీ ఆకర్షించింది. అందాల తార ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణెను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Aishwarya Rai Gets Emotional As She Hugs Deepika Padukone: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకలో రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లి సంబురాలకు బాలీవుడ్ సినీలోకం తరలి వచ్చింది. ట్రెడిషనల్ వేర్ లో సినీతారలు ఆకట్టుకున్నారు. పెళ్లి తర్వాత అందరూ కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.

దీపికను హగ్ చేసుకుని కంటతడి పెట్టిన ఐశ్వర్య

ఇక ఈ పెళ్లివేడుకలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య ఎమోషనల్ అయ్యింది. కంటతడి పెట్టుకుంది. త్వరలో తల్లి కాబోతున్న దీపికా పదుకొణె చెవిలో గుసగుసలాడుతూ కనిపించింది. ఇద్దరు అగ్రతారలు ఏమాత్రం ఈగో లేకుండా ప్రేమగా ఆలింగనం చేసుకోవడాన్ని పక్కనే ఉన్న హృతిక్ రోషన్ చూసి సంతోషంగా ఫీలయ్యాడు. ఒకరికి ఒకరు అప్యాయంగా పలకరించిన ఈ వీడియో వారి ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది. 

ఇషా ప్రీ వెడ్డింగ్ బాష్ లోనూ డ్యాన్స్ చేసిన దీపిక, ఐశ్వర్య

నిజానికి ఐశ్వర్య, దీపికా మధ్య మంచి స్నేహం ఉంది. 2018లో జరిగిన ఇషా అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్ లోనూ ఇద్దరు ఫుల్ ఎంజాయ్ చేశారు. పక్కనే ఉన్న దీపికను, ఐశ్వర్య డ్యాన్స్ ఫ్లోర్ మీదికి తీసుకెళ్తుంది. అక్కడ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. ఆ తర్వాత దీపిక కూడా ఆరాధ్య బచ్చన్ తో కలిసి డ్యాన్స్ చేసింది. ఆమెతో కలిసి ఫోటోలకు పోజులిచ్చిది. అటు ఈ పెళ్లి వేడుకలో సీనియర్ నటి రేఖను ఐశ్వర్య కలిసింది. ఇద్దరూ కలిసి కాసేపు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. రేఖ ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యతో ముచ్చటిస్తూ కనిపించింది. అందరూ కలిసి రెడ్ కార్పెట్ మీద నడిచి ఆకట్టుకున్నారు.  

ఐశ్వర్య ఎందుకు సఫరేట్ గా వచ్చింది?

అంబానీ పెళ్లికి ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి సఫరేట్ గా రావడం, ఆ తర్వాత బచ్చన్ కుటుంబ సభ్యులు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత కొంతకాలంగా అభిషేక్ బచ్చన్ తో అంటీముట్టనట్లు ఉంటుందని, త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. అంబానీ పెళ్లిలో అభిషేక్ బచ్చన్ తన పేరెంట్స్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. ఐశ్వర్య వారి దగ్గరికి వెళ్లకపోవడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతుంది.

అంబానీ పెళ్లికి తరలి వచ్చిన సినీ దిగ్గజాలు

అంబానీ పెళ్లికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు తరలివచ్చారు.  ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పదుకొణె, రణబీర్ కపూర్, అలియా భట్ సహా పలువురు బలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఇంటర్నేషనల్ రియాలిటీ షో హోస్టు కిమ్ కర్దాషియాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.  తెలుగు నుంచి కూడా పలువురు స్టార్ హీరోలు హాజరయ్యారు. WWE సూపర్ స్టార్ జాన్ సెనా కూడా ఈ పెళ్లిలో తళుక్కున మెరిశాడు.

Read Also: పెళ్లి దుస్తుల్లో యువరాణిలా మెరిసిన రాధికా మర్చంట్- ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jagadhatri Serial Today August 14th:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
జగద్ధాత్రి సీరియల్:కమలాకర్‌కు సారీ చెప్పి దగ్గరైన యువరాజు....జేడీపై గెలవడానికి మీనన్ ఎలాంటి ఎత్తు వేశాడు...?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget