Saami Saami Viral Video: ‘సామీ.. సామీ..’ పాటకు ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు.. చూడటానికి రెండు కళ్లూ చాలవు!
పుష్ప సినిమాలోని సామి సామి పాటకు ఒక ఎయిర్ హోస్టెస్ చేసిన పెర్ఫార్మెన్స్ వైరల్ అవుతోంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అంతర్జాతీయంగా ఎంతో మంది క్రికెట్ సెలబ్రిటీలు, ఫుట్ బాల్ సెలబ్రిటీలు శ్రీవల్లిలో ఫేమస్ హుక్ స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్, డ్వేన్ బ్రేవో, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వంటి సెలబ్రిటీలు కూడా ఇప్పటికే ఈ స్టెప్ వేశారు.
అయితే ఇప్పుడు ఆయత్ అనే ఎయిర్ హోస్టెస్ ‘సామీ సామీ’ పాటకు వేసిన స్టెప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో ‘మానికే మగే హితే’ అనే శ్రీలంక పాటకు కూడా ఈ ఎయిర్ హోస్టెస్ ఆయత్ వేసిన స్టెప్ ఎంతగానో ఫేమస్ అయింది. తను సామీ సామీ పాటకు డ్యాన్స్ వేసిన విధానానికి ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఎంతో మంది సామీ సామీ పాటకు పెర్ఫామ్ చేయమని అడగటంతో ఈ వీడియో చేసినట్లు ఆయత్ కామెంట్ చేసింది.
2021 డిసెంబర్ 17వ తేదీన విడుదలైన పుష్ప సినిమా అన్ని భాషల్లో ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా సాధించింది. ఇందులో హిందీ గ్రాస్ రూ.100 కోట్లపైగా ఉండటం విశేషం. త్వరలో రూ.100 కోట్ల నెట్ మార్కును కూడా పుష్ప దాటనుంది. బాహుబలి సిరీస్, సాహో, 2.0 సినిమాల తర్వాత ఈ మార్కును చేరనున్న సౌత్ సినిమా ఇదే కావడం విశేషం.
View this post on Instagram