Intinti Ramayanam: ఓటీటీ వేదికగా 'ఇంటింటి రామాయణం', నిర్మాతగా మారిన దర్శకుడు మారుతి!
ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉంది. ముందు నుంచీ ఓటీటీ వేదికలు ఉన్నా.. కరోనా సమయంలో ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది.
ప్రస్తుతం ఓటీటీలకు మంచి డిమాండ్ ఉంది. ముందు నుంచీ ఓటీటీ వేదికలు ఉన్నా.. కరోనా సమయంలో ఓటీటీ లకు ప్రాధాన్యత పెరిగింది. అలాగే వెబ్ సిరీస్ లు, చిన్న సినిమాలకు ఓటీటీ లు మంచి వేదికలుగా నిలుస్తున్నాయి. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో వస్తోన్న వెబ్ సిరీస్ లు, సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. అందుకే పెద్ద పెద్ద స్టార్ లు కూడా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. తెలుగులో ఆహా ఓటీటీ మంచి గుర్తింపు తో దూసుకుపోతోంది. ఇందులో వచ్చే కార్యక్రమాలు, వెబ్ సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఆహా ఓటీటీ వేదికగా 'ఇంటింటి రామాయణం' అనే వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది.
మధ్య తరగతి కుటుంబాల్లో సహజంగా జరిగే సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో సినిమా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం మంచి టీమ్ పనిచేసిందని, బాగా వచ్చిందని అన్నారు. మానవ బంధాలు, సంబంధాలు, జీవిత గుణపాఠాలు ఇలా అన్నింటిని ఈ సినిమాలో చూపించామని, అంతా మనకు తెలిసిన ప్రపంచంలానే ఉంటుందని చెప్పారు. ఇది అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా అవుతుందని చెప్పుకొచ్చారు నాగవంశీ.
తెలంగాణ లో ఓ ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్రలో రాహుల్ రామకృష్ణ కనిపించనున్నాడు. ఇందులో అతని కుటుంబం ఓ అనుకోని సమస్యల్లో పడుతుంది. ఆ సమస్య నుంచి బయటపడటానికి అతను ఏం చేశాడు? అనే అంశం పై కథ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ రామకృష్ణ సరసన నవ్యస్వామి నటించనుంది. బుల్లితెర పై నవ్య ‘నా పేరు మీనాక్షి’,‘ఆమె కథ’ వంటి టీవీ సీరియల్స్ ద్వారా పాపులర్ అయింది. బిత్తిరి సత్తి కూడా మరొక పాత్రలో కనిపించనున్నారు. అలాగే మరొక పాత్రలో ‘గంగవ్వ’ నటిస్తోంది. కల్యాణి మాలిక్ సంగీతాన్ని అందించారు.
మరోవైపు ఈ వెబ్ సిరీస్ కోసం సినిమాకు దర్శకుడు మారుతి రచన, నిర్మాణ సహకారం అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అలాగే 'ఇంటింటి రామాయణం' కు మారుతి షాడో దర్శకుడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే మారుతి ప్రస్తుతం హీరో ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రభాస్ కూడ ఈ సినిమాపై ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. మరి ఇలాంటి సమయంలో మారుతి చిన్న సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం పని చేయడం ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చడం లేదట. మరి దీనిపై మారుతి ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అతి త్వరలోనే మళ్లీ మారుతికి డేట్లు ఇస్తాడని తెలుస్తోంది. ఇక చిన్న సినిమాలకు మారుతి పెట్టింది పేరు. ఆయన తీసిన సినిమాలు అన్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా ఇస్తుంటాయి. మరి ఆయన పాలు పంచుకున్న ఈ 'ఇంటింటి రామాయణం' ఓటీటీ ప్రేక్షకులను ఎంత వరకూ ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి రానుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను నవంబర్ 25 న విడుదల చేయనున్నారు టీమ్.