అన్వేషించండి

Kannappa Movie: నిన్న మోహన్ లాల్, నేడు శరత్ కుమార్ - ‘కన్నప్ప’ కోసం మంచు ఫ్యామిలీ ఎక్కడా తగ్గట్లేగా

Kannappa Movie Updates : మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కన్నప్ప‘. ఈ మూవీలో మరో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.

Kannappa Movie Updates : వరుస పరాజయాలతో కెరీర్ కొనసాగిస్తున్న మంచు విష్ణు, ఓ ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దిగవంగత నటుడు కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ ‘భక్త కన్నప్ప’ చిత్రాన్ని తిరిగి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు అగ్ర హీరోలు నటిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఫోటోలను షేర్ చేశారు.

‘కన్నప్ప’ చిత్రంలో స్టార్ హీరోలు

మంచు విష్ణు కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ఈ సినిమా నిర్మాణం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మోహన్ బాబు. విష్ణు ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్‌, లేడీ సూపర్ స్టార్ నయనతార శివపార్వతులుగా కనిపించనున్నట్లు గత కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్‌ హీరోలు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. వారిలో ఒకరు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కాగా, మరొకరు తమిళ స్టార్ హీరో శరత్ కుమార్. “ఇద్దరు లెజెండరీ హీరోలు షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అద్భుతమైన సినిమాకు వారి శక్తి అదనపు బలంగా మారబోతోంది. ప్రసిద్ధ పురాణ కథ కోసం రెడీగా ఉండండి” అంటూ సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు వారి ఫోటోలను రిలీజ్ చేసింది.  ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by 24 Frames Factory (@24framesfactory)

ఒకే షెడ్యూల్​లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్

ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయనున్నారు మేకర్స్. ఇందుకోసం 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు ఆర్ట్‌ వర్క్‌ చేయించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. గాయాల నుంచి కోలుకోగానే సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుంది.  

భారీ బడ్జెట్​తో రూపొందుతున్న ‘కన్నప్ప’

ఇక ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకం పై దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపుర్ సనన్ ఫిక్స్ అయినా, కొన్ని కారణాలతో ఆమె తప్పుకుంది. పరుచూరి గోపాలకృష్ణ, బుర్ర సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ సినిమాకు కథను అందిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి మ్యూజిక్ అందిస్తున్నారు.

Read Also: వారి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అదే, వైవాహిక జీవితంపై హన్సిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 4th:విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
నువ్వులేక నేను లేను: విక్కీకి తొలిముద్దు పెట్టిన రాధ...విక్కీ మనసులో చోటు కోసం భార్యగా ప్రయత్నాలు
Podarillu Serial Today August 4th:మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌కు పెళ్లిచూపులు...ఆడపెళ్లివారి అభ్యంతరాలు ఏంటి..?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget