అన్వేషించండి
Advertisement
Major Latest Collections: లాభాల బాటలో 'మేజర్' - మూడో రోజుకే బ్రేక్ ఈవెన్!
'మేజర్' సినిమా మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!
26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషించారు. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన లాభాల దిశగా దూసుకుపోతుంది. మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!
నైజాం - రూ.5.01 కోట్లు
సీడెడ్ - రూ.1.28 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.1.42 కోట్లు
ఈస్ట్ - రూ.95 లక్షలు
వెస్ట్ - రూ.63 లక్షలు
గుంటూరు - రూ.75 లక్షలు
కృష్ణా - రూ.71 లక్షలు
సీడెడ్ - రూ.1.28 కోట్లు
ఉత్తరాంధ్ర - రూ.1.42 కోట్లు
ఈస్ట్ - రూ.95 లక్షలు
వెస్ట్ - రూ.63 లక్షలు
గుంటూరు - రూ.75 లక్షలు
కృష్ణా - రూ.71 లక్షలు
నెల్లూరు - రూ.50 లక్షలు
మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.11.25 కోట్ల షేర్ ను సాధించింది ఈ సినిమా. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఇది రూ.18.80 కోట్లు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.1.25 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ, ఇతర భాషల్లో కలిపి రూ.2.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.70 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా మూడు రోజులకు గాను రూ.19.35 కోట్లు సాధించింది. అంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలో బాటలోకి చేరిపోయిందన్నమాట!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement