News
News
X

Aditi Rao - Siddharth : శర్వానంద్ ఎంగేజ్‌మెంట్‌లో సిద్ధూ, అదితి జోడీ - ప్రేమేనా గురూ!

Sharwanand Rakshitha's engagement : హీరో శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగింది. సినిమా ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. వారిలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జోడీపై అందరి చూపు పడింది. ఎందుకంటే...

FOLLOW US: 
Share:

యువ కథానాయకుడు శర్వానంద్ త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. ఓ ఇంటి వాడు కానున్నారు. ఈ రోజు రక్షితతో ఆయన నిశ్చితార్థం జరిగింది. దానికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. చిరంజీవి - సురేఖ, అక్కినేని నాగార్జున - అమల, రామ్ చరణ్ - ఉపాసన... ఇలా చాలా మంది దంపతులు వచ్చారు. అయితే... వారిలో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జోడీపై అందరి చూపు పడింది.

కొత్త జంటతో ప్రేమ జంట!?
కాబోయే దంపతులు శర్వానంద్, రక్షితతో సిద్ధార్థ్, అదితి రావు హైదరి ఫోటోలు దిగారు. అందులో తప్పు ఏముంది? అనొచ్చు. 

'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు. ఆ సినిమాలో శర్వానంద్ మెయిన్ హీరో. నిశ్చితార్థంలో 'మహాసముద్రం' హీరో హీరోయిన్లు రీ యూనియన్ కింద కూడా చూడొచ్చు. ఆ సినిమాతో మొదలైన సిద్ధూ, అదితిల పరిచయం ఆ తర్వాత...  నిజ జీవితంలో ప్రేమగా మారిందని గుసగుసలు వినిపిస్తున్న నేపథ్యంలో శర్వా, రక్షిత నిశ్చితార్థంలో వాళ్ళిద్దరి జోడీపై జనాల చూపు పడుతోంది.
 
హైదరాబాదీ అమ్మాయితో తమిళ అబ్బాయి ప్రేమ!
హీరోయిన్ అదితి రావు హైదరి (Aditi Rao Hydari) తో సిద్ధార్థ్ (Siddharth) ప్రేమలో ఉన్నారా? అంటే... 'అవును' అని తమిళ చిత్ర పరిశ్రమలో కొందరు అంటున్నారు. తాము ప్రేమలో ఉన్నామని వాళ్ళిద్దరూ ఎప్పుడూ చెప్పలేదు. కానీ, వాళ్ళు చేసే పనులు చూస్తే ప్రేమలో ఉన్నారని అనిపించక మానదు. 

అదితి... ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్!
అదితి రావు హైదరి పుట్టిన రోజు నాడు సిద్దార్థ్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ''హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్'' అని ఆమెతో దిగిన ఫోటోని ఆమెకు ట్యాగ్ చేస్తూ సిద్ధార్థ్ పోస్ట్ చేశారు. 'ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్' అంటే? అనేది నెటిజన్స్ డౌట్. తన హృదయంలో రాణి స్థానం అదితిదే అని సిద్ధార్థ్ కన్ఫర్మ్ చేశారా? ఈ పోస్ట్ వెనుక మీనింగ్ ఏంటి? అనేది డిస్కషన్ అయ్యింది. 

Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?

సిద్ధార్థ్ పోస్ట్ కింద కొన్ని కామెంట్స్ చూస్తే... వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సినీ ప్రముఖులు స్పష్టం చేస్తున్నట్లు ఉంది. అదితి రావు హైదరికి కొన్ని సినిమాల్లో ఏకా లఖాని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మణిరత్నం తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'కు కూడా ఆమె పని చేశారు. ఈ ఫోటో కింద ఆవిడ హగ్గులు ఇస్తున్న ఎమోజీ పోస్ట్ చేశారు. 'మేజర్' నిర్మాతలలో ఒకరైన శరత్ 'లవ్ యు గైస్' అని పేర్కొన్నారు. చాలా మంది అదితికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కొందరు సిద్ధార్థ్ మళ్ళీ ప్రేమలో పడ్డారని కామెంట్ చేయడం గమనార్హం.

పుట్టినరోజు పోస్టుకు తోడు ఇప్పుడు నిశ్చితార్థానికి జంటగా రావడంతో సిద్దార్థ్, అదితి రావు హైదరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఇండస్ట్రీలో జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. 

Also Read : 'హంట్' రివ్యూ : షాక్ ఇచ్చిన సుధీర్ బాబు, సినిమా ఎలా ఉందంటే?

Published at : 26 Jan 2023 04:12 PM (IST) Tags: Siddharth Aditi Rao Hydari Sharwanand Rakshitha Sharwanand Engagement

సంబంధిత కథనాలు

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Janaki Kalaganaledu April 1st:  రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

ఏప్రిల్‌ 3 నుంచి ఒంటి పూట బడులు, ఆ పాఠశాలలకు రెండు పూటలా సెలవులు!

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?