By: ABP Desam | Updated at : 07 Jul 2023 11:30 AM (IST)
పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లి?(Photo Credit: Netflix/Instagram)
Fact Check: అందాల తార సౌత్, నార్త్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. ఒకానొక సమయంలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. సుమారు రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. తాజాగా ‘లస్ట్ స్టోరీస్2’ వెబ్ సిరీస్ తో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ లో బోల్డ్ సీన్లలో నటించి మైండ్ బ్లాంక్ చేసింది.
తమన్నా.. హైదరాబాదీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. రీసెంట్ గా వీరిద్దరు తమ డేటింగ్ వ్యవహారాన్ని కన్ఫామ్ చేశారు. వీరి ప్రేమ విషయం బయటకు తెలిసిన తర్వాత తొలిసారి ఇద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్2’లో నటించారు. ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తమ ప్రేమ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా తమన్నాకు సంబంధించి కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తానీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్‌ను మిల్కీ బ్యూటీ పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
2017లో తమన్నా, అబ్దుల్ రజాక్ ఇద్దరూ దుబాయ్‌లో జ్యువెలరీ స్టోర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వాళ్లు ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దుబాయ్‌లో తమన్నా, రజాక్‌ల నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరిగింది. అప్పట్లో తమన్నా ఈ వార్తలను కొట్టిపారేసింది. ఇవే ఫోటోలు 2020లో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఆమె రజాక్‌ను పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రజాక్ తో పెళ్లి గురించి మీడియా ప్రతినిధులు తమన్నాను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు తను నవ్వుతూ సమాధానం చెప్పింది. “రజాక్‌తో పెళ్లి ప్రశ్న తలెత్తే అవకాశం లేదు. ఇప్పటికే తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఆయనకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా” అని చెప్పింది. “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న నిరాధారమైన వార్తలను తీవ్రంగా పరిగణిస్తాను. ప్రస్తుతం నేను ఒంటరిగా సంతోషంగా ఉన్నాను. నా తల్లిదండ్రులు నాకు భర్తను వెతికే పనిలో అసలే లేరు” అని వెల్లడించింది. ప్రస్తుతం నేను రొమాన్స్ చేస్తున్నది కేవలం సినిమా ప్రయత్నాలతోనేనని తమన్నా తెలివిగా సమాధానం చెప్పింది. తన రిలేషన్ షిప్ గురించి గానీ, పెళ్లి గురించి గానీ, ఏ విషయం ఉన్నా తానే తానే స్వయంగా మీడియాకు తెలియజేస్తానని వెల్లడించింది. అనవసర ఊహాగానాలు ఎవరికీ మంచికాదని చెప్పింది.
Read Also: హింసను గ్లామరైజ్ చేస్తున్నారు - ‘సలార్’ టీజర్‌పై ‘ది కశ్మీర్ ఫైల్స్’ దర్శకుడి పరోక్ష విమర్శలు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
ఫ్రీగా ‘సలార్’ టికెట్లు, ‘కాలింగ్ సహస్ర’కు థియేటర్ల కరువు - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: విడివిడిగా ఓటు వేసిన అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహ - వేర్వేరుగా వెళ్లడంతో...
Allu Arjun: అభిమాని కోసం బన్నీ సెల్ఫీ వీడియో - 30 వేల ఫాలోవర్లు టార్గెట్!
Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ సినిమా ఎక్కడ - 'యానిమల్' దెబ్బకు షోస్, స్క్రీన్స్ గల్లంతు
Bigg Boss Telugu 7: అమర్‌పై యావర్ డౌట్లు, ఆటలో చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!
Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్ ప్రారంభం
Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!
Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం 51.89
/body>