News
News
X

Sree leela: మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, రౌడీ బాయ్‌తో రొమాన్స్ కు రెడీ!

వరుస అవకాశాలతో జోష్ మీదున్న శ్రీలీలకు మరో క్రేజీ ఆఫర్ దక్కింది. విజయ్ దేరకొండ తదుపరి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ లో మాంచి స్వింగ్ లో కొనసాగుతోంది హీరోయిన్ శ్రీలీల. వరుస అవకాశాలు దూసుకుపోతోంది. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా హిట్ తో  మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. సీనియర్‌ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు అందరి సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.   

విజయ్ దేవరకొండ మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

ఇప్పటికే పలు ప్రాజెక్టులకు శ్రీలీల ఓకే అయ్యింది. మహేష్ బాబు, రామ్, నితిన్, వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టి సినిమాల్లో నటిస్తోంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలోనూ నటిస్తున్నది. ఇందులో బాలయ్య కూతురుగా కనిపించనుందని టాక్. ఇక సముద్రఖని, పవన్ కాంబోలో వస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్ తో అలరించబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మరో ఆఫర్ దక్కించుకుంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తదుపరి మూవీలో హీరోయిన్ గా ఓకే అయినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత  జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో  శ్రీలీల హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

View this post on Instagram
 
A post shared by Sreeleela (@sreeleela14)

స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కనున్న విజయ్, గౌతమ్ మూవీ    

విజయ్ దేవరకొండ,గౌతమ్ తిన్ననూరి కాంబోలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా రూపొందబోతోంది. ప్రస్తుతం  దీనికి 'VD 12' అనే పేరు పెట్టారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విజయం గతంలో ఎప్పుడు కనిపించని క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్‌ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో ఓ వ్యక్తి పోలీస్ డ్రెస్సులో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిలా కనిపిస్తున్నాడు.  సముద్రతీరంలో మంటల్లో కాలిపోతున్న పడవలతో పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.

‘జెర్సీ’తో జాతీయ స్థాయిలో గుర్తింపు

ఇక గౌతమ్ చిన్న సూరి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు.  'మ‌ళ్ళీరావా', 'జెర్సీ' సినిమాలో సత్తా చాటుకున్నారు.  'జెర్సీ' సినిమాతో జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు లభించింది.  అటు పూరీ జగన్నాథ్ తో కలిసి విజయ్ ‘లైగర్‘ సినిమా చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలం అయ్యింది.  ‘లైగర్’ ఫ్లాప్ తో కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న విజయ్, ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాడు.   

Read Also: సూర్య అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పిన మల్లు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్

Published at : 02 Mar 2023 03:00 PM (IST) Tags: Vijay Deverakonda Gautam Tinnanuri Actress Sree leela

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే