Samantha Akkineni : సమంత ఆస్తుల విలువ ఎంతంటే..?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. పెళ్లైన తరువాత కూడా ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ..సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
'ఏ మాయ చేసావే' సినిమాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన సమంత అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. ఇప్పటివరకు ఆమె 65కి పైగా చిత్రాల్లో నటించింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సమంత ఒకరు. పెళ్లైన తరువాత కూడా ఆమె క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ.. సరికొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తోంది.
మూడు రోజులు చీకటి గదిలోనే :
ఈ ఏడాది 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో సమంత పోషించిన రాజీ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సిరీస్ కోసం ఆమె కఠోర సాధన చేసింది. రాజీ పాత్రపై పూర్తి అవగాహన తెచ్చుకోవడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. ఎన్నో డాక్యుమెంటరీలను చూసింది. మూడురోజుల పాటు చీకటి గదిలోనే ఉంటూ మొత్తం డాక్యుమెంటరీలను పూర్తి చేసి పాత్రకు సిద్ధమైంది.
ఎత్తైన ప్రదేశాలంటే భయం :
అంతేకాదు.. ఫిజికల్ కూడా ఎంతో కష్టపడింది. ఈ సిరీస్ లో ఎలాంటి డూప్స్ సాయం తీసుకోకుండా మొత్తం స్టంట్స్ అన్నీ తనే చేసింది. శిక్షణ తీసుకునే సమయంలో శరీరంలో ప్రతీభాగం నొప్పిగా ఉండేదని.. పెయిన్ కిల్లర్స్ తో ముందుకు సాగానని తెలిపింది. ఎత్తైన ప్రదేశాలంటే భయం ఉన్నప్పటికీ ఈ సిరీస్ లో ఒక బిల్డింగ్ నుండి మరో బిల్డింగ్ కి దూకే స్టంట్స్ చేశానని తెలిపింది.
షాకింగ్ రెమ్యునరేషన్ :
ఈ ఒక్క సిరీస్ కోసం అమ్మడు రూ.4 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుందని సమాచారం. ఒక్కో సినిమా రెండు నుండి మూడు కోట్లు తీసుకునే సమంత తన పదేళ్ల కెరీర్ లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది.
సొంత వ్యాపారాలు :
సినిమాలతో పాటు పలు యాడ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఎక్కువ మొత్తంలో పారితోషికం అందుకుంటుంది. అంతేకాదు.. సమంతకు సొంతంగా రెండు బిజినెస్ లు కూడా ఉన్నాయి. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి కాగా.. మరొకటి ఎకాం అనే ప్రీ స్కూల్. పిల్లలకు వినూత్నంగా విద్యను అందించే లక్ష్యంతో ఇతర భాగస్వాములతో కలిసి ఈ సంస్థను మొదలుపెట్టింది సమంత.
కొత్త వ్యాపారం :
ఇప్పుడు కొత్త మరో బిజినెస్ కోసం మొదలుపెట్టబోతోంది. మరికొద్దిరోజుల్లో ఆమె ఫ్యాషన్ జ్యువలరీ స్టోర్ ను ప్రారంభిస్తుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులను సమంత దగ్గరుండి చూసుకుంటుంది. ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త కలెక్షన్ తో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టబోతోంది.
సమంత లగ్జరీ పెట్టుబడులను పరిశీలిస్తే.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఆమెకొక విలాసవంతమైన ఇల్లు ఉంది. అలానే రెండు కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లు రెండు ఉన్నాయి. అలానే జాగ్వార్ కారు కూడా ఉందని తెలుస్తోంది. ఇవన్నీ కూడా సమంత సొంతంగా సంపాదించుకున్న ఆస్తులు. వీటితో పాటు తన భర్త నాగచైతన్యకు వందల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి.
సామాజిక సేవ :
ఆనాధలు, అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ప్రత్యుష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి వారికి సేవలందిస్తోంది సమంత. ప్రాణాపాయంలో ఉన్న మహిళలు, చిన్నారులను ఆడుకుంటోంది. తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రాల్లో ప్రముఖ ఆస్పత్రులతో కలిసి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్య సేవలు అందేలా చేస్తుంది.
ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో నటిస్తోంది. మొదటిసారి సమంత నటిస్తోన్న పౌరాణిక సినిమా ఇది. దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి మరో సినిమాలో నటిస్తోంది.