By: ABP Desam | Updated at : 31 Mar 2023 11:56 AM (IST)
Edited By: Mani kumar
Image Credit:Rashmika/Instagram
Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. ‘పుష్ప’ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవల్ లో రష్మికకు క్రేజ్ పెరిగిపోయింది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించన రష్మికకు మంచి గుర్తింపు వచ్చింది. ఆమె ప్రస్తుతం ‘పుష్ప 2’ లో నటిస్తోంది. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే, రష్మిక మరో క్రేజీ ప్రాజెక్టులో భాగం అయ్యింది. గతంలో నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్వకత్వంలో వచ్చిన ‘భీష్మ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక. అయితే మరోసారి నితిన్ తో జతకట్టనుంది ఈ బ్యూటీ. ఈ సినిమాకు కూడా వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా పూజా కార్యక్రమాలతో ఈ మూవీను ప్రాంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫస్ట్ క్లాప్ కొట్టి మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణ భారతదేశంలో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోయిన్ లలో రష్మిక మందన్న ఒకరు. అయితే ‘పుష్ప’ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకున్న ఈ భామ ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందట. ఇప్పుడు నితిన్-వెంకీ మూవీ కోసం భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె రూ.3 కోట్ల నుంచి 5 కోట్ల వరకూ పారితోషికం అందుకోనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెతను రష్మిక బాగానే ఫాలో అవుతుందని అంటున్నారు ఈ వార్త తెలిసిన మూవీ లవర్స్. ఇప్పటికే ఇండస్ట్రీలో పురుషులతో సమానంగా పారితోషికం అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పలువురు స్టార్ హీరోయిన్ లు దీనిపై స్పందించారు కూడా. ఈ నేపథ్యంలో రష్మిక ఓ సినిమా కోసం ఇంత భారీ మొత్తంలో పారితోషికం అందుకోవడం విశేషం. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది మూవీ మేకర్స్ నే చెప్పాలి.
రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ‘పుష్ఫ 2’ షూటింగ్ లో బిజీ బిజీ గా గడుపుతోంది. వీటితో పాటు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘యానిమల్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలు షూటింగ్ జరుగుతుండగానే నితిన్ సినిమాను ఓకే చేసేసింది రష్మిక. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది తమిళ స్టార్ నటుడు విజయ్ ‘వారసుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ మూవీ ‘మిషన్ మజ్ను’ లో కూడా చేసింది. ఇక నితిన్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తనకు ‘భీష్మ’ లాంటి హిట్ అందించిన వెంకీ కుడుములను నమ్ముకున్నారు నితిన్. మరి ఈ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.
Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?
Sirf Ek Bandaa Kaafi Hai In Telugu : అసామాన్యుడితో సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి మనోజ్ సినిమా తెలుగు వెర్షన్
Raja Ravindra New Movie : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో 'డియర్ జిందగీ' - అసలు కథ ఏమిటంటే?
Indiana Jones And The Dial Of Destiny: అమెరికాలో ఒక్క రోజు ముందుగా ఇండియాలో 'ఇండియానా జోన్స్' లేటెస్ట్ మూవీ
Guppedanta Manasu June 3rd: కేడీ బ్యాచ్ పనిపట్టేందుకు సిద్ధమైన వసు, ఫస్ట్ టైమ్ శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చిన దేవయాని!
Brahmamudi June 3rd: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు
Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్ టీం ఏర్పాటు
BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?
AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?
తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!