Radha Emotional: నమ్మలేకపోతున్నా - సూపర్ స్టార్ కృష్ణను తలచుకుని నటి రాధా కన్నీళ్లు
ఇటీవల ఓ టీవీ ప్రోగ్రాంలో కనిపించింది అలనాటి నటి రాధ. ఈ ప్రోగ్రాంలో సూపర్ స్టార్ కృష్ణ ను తలుచుకొని ఎమోషనల్ అయింది. ఆయన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ కన్నీరు పెట్టుకుంది.
టాలీవుడ్ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం ఆయన అభిమానులు, సినీ పరిశ్రమను ఎంతగా కలచివేసిందో తెలిసిందే. ఆయన తన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకోవడమే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి ఎంతో కృషి చేశారు. అలాంటి గొప్ప నటుడు మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణించారనే వార్త ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణతో కలసి పలు సినిమాల్లో నటించిన అలనాటి నటి రాధ ఆయన్ను తలుచుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల ఓ డాన్స్ షో కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా కనిపించిన రాధ మాటల సందర్భంగా కృష్ణ ను తులచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
‘స్టార్ మా’ టీవీలో బిబి జోడి డాన్స్ షో కార్యక్రమం జరుగుతోంది. ఈ షో తరువాత ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ను ఇటీవల విడుదల చేశారు. ప్రోమో చివర్లో జబర్దస్త్ అవినాష్ సూపర్ స్టార్ కృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ నటి రాధతో మాట్లాడాడు. అవినాష్ కు సమాధానం చెప్తూ ఎమోషనల్ అయ్యింది రాధ. కృష్ణ లేరు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆయన్ని తాను ఎంతగానో మిస్ అవుతున్నాని అంది. ఐ రియల్లీ లవ్ హిమ్ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది రాధ. దీంతో ఈ వీడియో చూసి నెటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. అప్పటి సినిమాల్లో కృష్ణ, రాధ జంటకు ఆన్ స్క్రీన్ పై మంచి పేరు ఉండేది. ‘సింహాసనం’, ‘అగ్నిపర్వతం’, ‘పల్నాటి సింహం’, ‘ముగ్గురు కొడుకులు’ వంటి సూపర్ హిట్టు సినిమాలతో పాటు పదికి పైగా చిత్రాల్లో కృష్ణ, రాధ కలిసి నటించారు. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్ వచ్చే పాటల్లో డాన్స్ లు హైలెట్ గా నిలిచేవి. ఆ పాటల కోసమే సినిమాలకు వెళ్లేవారు కొంతమంది ఫ్యాన్స్. అంతలా సినిమాల్లో ఈ జంటకు డిమాండ్ ఉండేది.
గత కొంత కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ కు సంబంధించి సీనియర్ నటీనటులు చాలా మంది మరణిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉండే నటుల్ని వరుసగా కోల్పోవడంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత కృష్ణ, కృష్ణంరాజు లాంటి పెద్ద హీరోలు పరిశ్రమకు పెద్ద దిక్కులా ఉండేవారు. ఈ మధ్య కాలంలోనే కృష్ణంరాజు మరణించారు. ఆయన చనిపోయిన కొన్ని రోజులకు సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ విషాద ఘటనల నుంచి తేరుకోకముందే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్త తెలిసింది. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజుల వ్యవధిలోనే నటుడు చలపతి రావు గుండెపోటుతో కన్నుమూశారు. ఇలా వరుస సీనియర్ నటుల మరణ వార్తలు ఇండస్ట్రీని కుదిపేశాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ ఏడాది చేదు అనుభవమే అని చెప్పాలి.