అన్వేషించండి
Advertisement
Pragathi: 'ఊ అంటావా మావా..' సాంగ్ కి ప్రగతి మాస్ స్టెప్పులు.. ఓ లుక్కేయండి..
నటి ప్రగతి 'ఊ అంటావా మావ ఊఊ అంటావా..?' పాటకు స్టెప్పులేసి నెటిజన్లను మెప్పించింది.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాకి పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో సమంత చేసిన ఐటెం సాంగ్ ఇండియా వైడ్ వైరల్ అయింది. సమంత నటించిన ఈ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 'ఊ అంటావా మావ ఊఊ అంటావా..?' అంటూ సాగే ఈ పాటను ఇంద్రావతి చౌహాన్ పాడింది. ఈ పాట మీద చాలా రీల్స్ వచ్చాయి. చాలా మంది కవర్ సాంగ్స్ కూడా చేశారు.
బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి ఈ పాటను రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. సమంత వేసిన కాస్ట్యూమ్స్ లాంటివే ధరించి మాస్ స్టెప్పులేసింది. కానీ ఈ విషయంలో సమంతను ఎవరూ బీట్ చేయలేరనుకోండి. తాజాగా నటి ప్రగతి కూడా ఈ పాటకు స్టెప్పులేసింది. సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు పోషించే ప్రగతి రియల్ లైఫ్ లో మాత్రం చాలా హాట్ గా కనిపించడానికి ఇష్టపడుతుంది.
ట్రెండీగా డ్రెస్ చేసుకుంటూ.. జిమ్ లో వర్కవుట్ చేస్తూ కనిపిస్తుంటుంది. ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలను, తన వర్కవుట్ వీడియోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పుడేమో 'ఊ అంటావా మావ ఊఊ అంటావా..?' పాటకు స్టెప్పులేసి నెటిజన్లను మెప్పించింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
Also Read: మాలీవుడ్ సూపర్ స్టార్ కి కరోనా పాజిటివ్..
Also Read: బీచ్ లో భార్యతో బాలయ్య ఫన్.. వీడియో వైరల్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement