News
News
వీడియోలు ఆటలు
X

Mrunal Thakur: 'సీతారామం' సీక్వెల్ - హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘సీతారామం’ సినిమా గతేడాది ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీను..

FOLLOW US: 
Share:

Mrunal Thakur: సినిమా రంగంలో లవ్ స్టోరీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ భాషలో అయినా ఈ సినిమాలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎక్కువ మంది కొత్త దర్శకులు ముందు లవ్ స్టోరీ సినిమాలను తెరకెక్కిస్తుంటుంటారు. టాలీవుడ్ లోనూ ఇది కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాల పట్ల ప్రేక్షకుడి విజన్ మారింది. సిల్వర్ స్క్రీన్ పై కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే ఇతర కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. సరైన లవ్ స్టోరీ సినిమా వచ్చి చాలా రోజులైంది. టాలీవుడ్ లో ఆ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేస్తున్నారు కొంత మంది యువ దర్శకులు. అలాంటి వారిలో హను రాఘవపూడి ఒకరు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతారామం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ స్వచ్చమైన ప్రేమ కథతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ఇందులో మృణాల్ అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ సినిమా పార్ట్ 2 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. నెట్టింట ఓ అభిమానికి ప్రశ్నకు బదులిస్తూ ‘సీతారామం 2’ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

‘సీతారామం’ సినిమా గతేడాది ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఓ ఎమోషనల్ లవ్ స్టోరీను ఎంతో కవితాత్మకంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, పాటలు ముఖ్యంగా మృణాల్ నటన అందర్నీ థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. వాస్తవానికి ఇలాంటి కాన్సెప్ట్ లవ్ స్టోరీలు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా వస్తున్నాయి. అందుకే ఈ మూవీను ప్రేక్షకులు అంతగా ఆదరించారు. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాతో మృణాల్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటుంది. అప్పుడప్పుడూ అభిమానుల ప్రశ్నలకు జవాబులు చెబుతుంది.

ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ఆమె ‘సీతారామం 2’ ఉంటుందా? అని అడిగాడు. దీనికి మృణాల్ సమాధానం చెప్పింది. తనకు ఈ విషయం గురించి పూర్తిగా తెలియదని, కానీ ‘సీతారామం 2’ ఉండాలనుకుంటున్నానని బదులిచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సీతారామం’ సినిమా హిట్ అయిన తర్వాత అందరూ ఈ సినిమాకు సీక్వెల్ ఉండాలని అనుకున్నారు. అయితే దర్శక నిర్మాతలు దాని గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు మృణాల్ ‘సీతారామం 2’ ఉంటే బాగుంటుందని అనడంతో ఈ మూవీ సీక్వెల్ పై మళ్లీ ఆసక్తి నెలకొంది. ఆమె ఇలా చెప్పిందంటే నిజంగా సీక్వెల్ కు ప్లాన్ చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు నెటిజన్స్. మరి దీనిపై మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

Published at : 10 Apr 2023 09:21 AM (IST) Tags: Hanu Raghavapudi Sita Ramam Mrunal actress mrunal thakur

సంబంధిత కథనాలు

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Gufi Paintal Hospitalized : ఆస్పత్రిలో  గుఫీ పెయింటల్ - విషమంగా 'మహాభారత్‌'లో శకుని ఆరోగ్య పరిస్థితి

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adipurush Movie: తెలుగులో ఆ తప్పులేంటి? 'ఆదిపురుష్' దర్శకుడిపై నెటిజెన్స్ సెటైర్లు

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

Adivi Sesh - Major's 1st Anniversary: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం

YS Viveka Case : సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !

YS Viveka Case :  సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి - అరెస్ట్ భయం లేనట్లే !