News
News
X

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. 

FOLLOW US: 
Share:

కాస్టింగ్ కౌచ్.. గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో దీనిపై చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. కానీ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ లోనే కాస్టింగ్ కౌచ్ గురించి వార్తలు వస్తుంటాయి. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో దీనిపై మీడియాలో విపరీతంగా చర్చలు కూడా నడిచాయి. అయితే తాజాగా టాలీవుడ్ నటి కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

కీర్తి సురేష్ ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొంది. ఈ సందర్భంగా కెరీర్ లో తను ఎదుర్కొన్న సవాళ్లు గురించి మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనతో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారని, వాళ్లకి ఎదురైన సంఘటనలను కూడా వివరించారని చెప్పింది. అయితే ఇప్పటి వరకూ తనకు అలాంటి అనుభవాలు ఏమీ ఎదురుకాలేదని పేర్కొంది. నిజానికి అది మన ప్రవర్తన ఆధారంగానే ఉంటుందని తెలిపింది. ఒకవేళ ఎవరైనా తనను కమిట్మెంట్ అడిగితే.. నో చెప్తానని చెప్పింది. అలా చెప్పడం వలన తనకు సినిమా అవకాశాలు రాకపోయినా పర్లేదని, వేరే ఏదైనా జాబ్ చేసుకుంటానని, అంతేగానీ అవకాశాల కోసం దిగజారనని క్లారిటీ ఇచ్చింది. 
 
కీర్తి సురేష్ సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచే వచ్చింది. కెరీర్ ప్రారంభంలో కోలీవుడ్ లో సినిమాలు చేసింది. తర్వాత తెలుగులో 2016 లో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘నేను శైలజ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తో కీర్తికి తెలుగులో మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే కీర్తి సురేష్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘మహానటి’. ఈ సినిమాతో కీర్తి కెరీర్ మలుపు తిరిగింది. ఈ మూవీలో అలనాటి మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు వందశాతం మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమా తర్వాత కీర్తీ సురేష్ కెరీర్ గాడి తప్పింది. 

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో చాలా సినిమాలు ఓటీటీ వేదికగా విడుదల అయ్యాయి. అలా కీర్తి సురేష్ నటించిన కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే అవి కీర్తి కు హిట్ అందించలేకపోయాయి. 2020 లో వచ్చిన ‘మిస్ ఇండియా’, అదే ఏడాది వచ్చిన ‘పెంగ్విన్’ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. తర్వాత నితిన్ తో చేసిన ‘రంగ్ దే’, ‘గుడ్ లక్ సఖి’ సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో కీర్తి కెరీర్ కాస్త డౌన్ అయింది. తర్వాత మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అందుకోవడంతో మళ్లీ కెరీర్ గాడిన పడింది. ఈ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ‘దసరా’ సినిమాలో కనింపించనుంది కీర్తి సురేష్. ఈ సినిమా కూడా ఆమెకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. 

Read Also: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Published at : 06 Dec 2022 05:27 PM (IST) Tags: Keerthy Suresh Dasara Movie Casting Couch Keerthy

సంబంధిత కథనాలు

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్ 

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Waltair Veerayya Success Event :  వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు