Archana Jois: ఫుట్ పాత్ మీద షాపింగ్ చేసిన ‘KGF‘ మదర్- నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
‘KGF‘లో మదర్ రోల్ పోషించి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చనా జోయిస్. తాజాగా ఈ ముద్దుగుమ్మ సింపుల్ రోడ్ సైడ్ షాపింగ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Actress Archana Jois Road Side Shopping: దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘కేజీఎఫ్’ సినిమాను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ సినిమాతో హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రంలో రాకీ భాయ్ గా యష్ పవర్ ఫుల్ గా రోల్ పోషించారు. రాకీ భాయ్ తల్లి పాత్రలో అర్చన జోయిస్ అద్భుతంగా నటించింది. 30 ఏండ్ల యష్ కు 21 ఏండ్ల అర్చన తల్లిపాత్ర చేయడమే కాదు, ఎమోషనల్ యాక్టింగ్ తో అబ్బుర పరిచింది. ఆమె నటన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు. ఈ సినిమాతో నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
రోడ్ సైడ్ షాపింగ్ చేస్తూ కనిపించిన అర్చన
నటిగా అర్చన ఎంత గొప్ప పేరు తెచ్చుకున్నా.. రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటుంది. రీసెంట్ గా రోడ్ సైడ్ షాపింగ్ చేస్తూ కనిపించింది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా అందిరితో కలిసిపోయి చిన్న చిన్న వస్తువుల కొనుగోలు చేసింది. ఓ బ్లాగర్ ఆమెను గుర్తు పట్టి కాసేపు మాట్లాడారు. యాక్టర్ గా మంచి క్రేజ్ లభించినా, సాదాసీదాగా ఉండటం అంటేనే తనకు ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం అర్చనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆమె సింప్లీసిటిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
View this post on Instagram
సీరియల్ లో చూసి సినిమాలో అవకాశం
అర్చన నృత్య కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘మహాదేవి’ అనే కన్నడ సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ చూసి దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘KGF‘లో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో హీరో తల్లిగా నటించాలని కోరారు. మొదట్లో తాను హీరో తల్లిగా నటించడం ఏంటని భావించి నో చెప్పిందట. కానీ, తన ఫ్రెండ్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో వచ్చిన అవకాశాలన్ని వదులుకోవడం మంచిది కాదని చెప్పడంతో మనసు మార్చుకుంది. తనకంటే 9 సంవత్సరాలు వయసులో పెద్ద అయిన యష్ కు.. అర్చన తల్లిగా చేసింది. ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
‘KGF‘ సినిమాకు ముందే పెళ్లి
అర్చనకు 21 ఏండ్లకే పెళ్లైంది. తన దూరపు బంధువు శ్రేయస్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాతే ఆమె ‘KGF‘ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. పెళ్లైనా డ్యాన్స్, యాక్టింగ్ ను అర్చనా వదులుకోలేదు. ‘KGF‘ తర్వాత పలు సినిమాల్లో నటించింది. నటిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలనేది తన లక్ష్యం అని రీసెంట్ ఇంటర్వ్యూలో అర్చనా వెల్లడించింది.
View this post on Instagram
Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?