అన్వేషించండి

Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?

Devara Movie Trailer: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘దేవర’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. .

Devara Trailer Release Date: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకున్నాయి.  త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.        

సెప్టెంబర్ 10న ‘దేవర’ ట్రైలర్ విడుదల

‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదల గురించి చిత్ర నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటన చేశారు. సెప్టెంబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్ ను హీరో జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ సముద్రంలో పెద్ద రాయి మీద నిల్చొని ఉన్నాడు. వెనుక అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. చేతిలో పదునైన ఆయుధాన్ని పట్టుకుని కోపంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్రేజీ అప్ డేట్ చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)

ట్రైలర్ రిలీజ్ అక్కడేనా?

‘దేవర’ సినిమా ప్రమోషన్స్ ను నార్త్ నుంచి మొదలు పెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ముంబై వేదికగా పెద్ద ఈవెంట్ ను నిర్వహించడంతో పాటు,  సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్  చేస్తోంది. సుమారు 2 నిమిషాల 45 సెక‌న్ల నిడివితో ఇప్పటికే ట్రైలర్ కట్ పూర్తైనట్లు సమాచారం. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత మిగిలిన రెండు పాటలను రిలీజ్ చేసి మూవీపై  భారీగా అంచనాలు పెంచాలని భావిస్తున్నారు. అదే ఊపులో ‘దేవర’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా అట్టహాసంగా విడుదల

‘దేవర’ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాలు థియేట్రికల్ రైట్స్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ దక్కించుకున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్ లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ దుమ్మురేపుతున్నాయి. అమెరికాతో పాటు, కెనడాలో బుకింగ్స్ ఓపెన్‌ అయిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె  నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ గా నటిస్తుండగా,  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Read Also: ట్రోలింగ్‌ను తట్టుకుని మరీ ట్రెండింగ్‌లోకి వచ్చిన దేవర సాంగ్... ఎన్టీఆర్ పవర్ అంటే ఇదీ

టాప్ హెడ్ లైన్స్

Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: రోడ్డు మీద ప్రమిదలు అమ్ముతున్న క్రిష్! కొడుకుని పట్టుకొని వెక్కివెక్కి ఏడ్చేసిన మహా!
Godavari Serial Today November 10th: 'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!
'గోదావరి' సీరియల్: సంజయ్ గతం ఇదే! సంజు కోసం మనసు మార్చుకున్న జాను!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
YSRCP On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దు: క్యాడర్‌కు వైసీపీ అధినేత ఆదేశాలు
KA Paul: నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
నేను ఆ పని చేస్తే వారం రోజుల్లోగా రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుంది: కేఏ పాల్ సంచలనం
Makhana Benefits : రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
రోజూ మఖానా తింటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే.. డైట్‌లో ఇలా చేర్చుకోండి
Pawan Kalyan Divorce: పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకుల ప్రకటన ఇప్పుడు ఎందుకు చేశారంటే !
Car Engine Problems: మిస్‌ఫైరింగ్ నుంచి 'చెక్ ఇంజిన్' లైట్ వరకు.. ఇంజిన్‌కు ప్రమాదం తెచ్చే 3 సమస్యలు ఇవే
కారు ఇంజిన్‌లో ఈ 3 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. సర్వీస్ సెంటర్‌కు మాత్రమే వెళ్లండి
Weight Loss Recipe : బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
బరువు తగ్గాలనుకునేవారి నోరూరించే టేస్టీ రెసిపీ.. పనీర్, వెజిటెబుల్స్​తో ఈ రైస్ ట్రై చేయండి
Congress Politics: 9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
9 సార్లు ఛాన్స్ ఇచ్చిన కాంగ్రెస్.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా చిన్నారెడ్డి! అసలేం జరుగుతోంది?
Embed widget