అన్వేషించండి

Actress Anjali Emotional: ఆ సీన్లు ఒక్కోసారి హద్దులు దాటతాయి - చాలా బాధ కలుగుతుంది: అంజలి

నటి అంజలి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్‌లో నటించడం కష్టమా? లేదా ముద్దు సీన్స్ లో నటించడం కష్టమా? అని అడిగిన ప్రశ్నలకు అంజలి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.

టాలీవుడ్ బ్యూటీ అంజలి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా తన నటన అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తమిళంలో వచ్చిన ‘కత్తరదు తమిళ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలీవుడ్ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్ ‘ఫాల్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇటీవల అంజలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్బంగా యాంకర్.. సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ లలో నటించడం కష్టమా? లేదా ముద్దు సీన్స్ లో నటించడం కష్టమా? అని అడిగిన ప్రశ్నలకు అంజలి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

యాంకర్ అడిగిన ప్రశ్నలకు అంజలి సమాధానాలు చెప్తూ.. ఇంటిమేట్ సీన్స్ లలో నటించడమే కష్టమని అంజలి చెప్పింది. తాను అన్ని సీన్స్ లలో నటించగలను అని అనుకుంటానని, అయితే ఇంటిమేట్ సీన్స్ విషయానికొచ్చేసరికి అది ఒక్కోసారి హద్దులు దాటిపోయే సందర్భాలు కూడా ఎదురవుతాయని చెప్పింది. అలా జరిగినపుడు చాలా బాధ కలుగుతుందని, ఒక్కోసారి సీన్ చేసిన తర్వాత కారవ్యాన్ లో కూర్చొని ఏడ్చేదాన్నని అంది. అయితే తన అంగీకారంతోనే షూట్ జరుగుతుందని తెలిపింది. సీన్ పండటం కోసం అలా నటించక తప్పదని పేర్కొంది. 

అలాగే తర్వాత ముద్దు సీన్ లు గురించి మాట్లాడుతూ.. కొన్ని సార్లు అలాంటి సన్నివేశాలు మనల్ని రెచ్చగొట్టేలా ఉంటాయని, అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. అయితే మనతో నటించే వ్యక్తులు ఆ స్థాయికి మించి నటించరని, కానీ అందరి ముందూ అలా చేయడానికే ఒక్కోసారి ఆలోచించాల్సి వస్తుందని తెలిపింది. షూటింగ్ జరిగేటప్పుడు ఎంత తక్కువ అనుకున్నా సూమారు 15 మంది వరకూ సెట్ లో మన చుట్టూ ఉంటారని చెప్పుకొచ్చింది అంజలి.

తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ గతంలో తాను రిలేషన్షిప్ లో ఉన్నానని అయితే అది తాను ఊహించుకున్నంత అందంగా లేదని అంది. కానీ తాను ఎప్పుడూ ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నాను అనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదని చెప్పింది. అయితే గతంలో అంజలి ‘జర్నీ’ సినిమాలో తనతో కలసి నటించిన నటుడు జైతో రిలేషన్షిప్ లో ఉందనే టాక్ వచ్చింది. కానీ కొన్నాళ్ల తర్వాత వాళ్లు బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పటి నుంచి అంజలి సింగిల్ గానే ఉంటోంది.

అంజలి ప్రస్తుతం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతోంది. అయితే ఈ ఏడాది తెలుగులో మాత్రం అంజలి అంత చెప్పుకోదగిన సినిమాలు ఏమీ చేయలేదు. నితిన్ హీరోగా నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. తాజాగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న RC-15లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2023లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also: టాప్ గన్ To అవతార్, ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఇవే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Allu Arjun Bail: చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ - హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో..
Google Pay Transaction Delete: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్‌ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Allu Arjun: అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
అల్లు అర్జున్ కేసులో బిగ్ ట్విస్ట్ - అవసరమైతే కేసు విత్ డ్రా చేసుకుంటానన్న రేవతి భర్త భాస్కర్
Skoda Kylaq: 10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
10 రోజుల్లో 10 వేల బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న స్కోడా కైలాక్!
Support From YSRCP: అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
అల్లు అర్జున్‌కు వైఎస్ఆర్‌సీపీ సపోర్టు - లాయర్ కూడా వైసీపీ ఎంపీనే !
Embed widget