Actor Vishal: పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరో విశాల్, అది పూర్తికావల్సిందేనట!
ఇటీవల లాఠీ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల పై స్పందించారు.
తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. దాదాపు ఆయన సినిమాలు అన్ని తెలుగులో కూడా రిలీజ్ అవుతాయి. అలా తెలుగులో డబ్ చేసిన సినిమాల్లో కొన్ని ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి కూడా. విశాల్ సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. దీంతో ఆయనకు పబ్లిక్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం విశాల్ 'లాఠీ' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ తన పెళ్లి గురించి వస్తోన్న వార్తల పై స్పందించారు.
విశాల్ పెళ్లి గురించి గతంలో చాలా పుకార్లు వచ్చాయి. మొదట్లో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో లవ్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ లవ్ ట్రాక్ ముగిసింది. తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన అనీషా రెడ్డి ని విశాల్ ప్రేమిస్తున్నాడని తెలిసింది. ఈ అమ్మాయి తో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కానీ ఏమైందో తెలీదు వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఆ తరువాత అనీషా రెడ్డి ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్లాడిందనే వార్తలు కూడా వచ్చాయి.
ఇటీవల విశాల్ పెళ్లి గురించి మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తెలుగులో రవితేజ, అల్లరి నరేష్ తదితర హీరోలతో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అలాగే నేనింతే, డమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర సినిమాలలోనూ కనిపించింది. ప్రస్తుతం విశాల్ ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెనే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే 'లాఠీ' టీజర్ లాంచ్ ఈవెంట్ లో విశాల్ తన పెళ్లి పై క్లారిటీ ఇచ్చేశాడు. అయితే అమ్మాయి ఎవరనేది చెప్పలేదు.
నడిగర్ సంఘం భవనం నిర్మించాకే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు విశాల్. తమిళనాడులో ఉన్న 3,500 మంది నటీనటులు, రంగస్థల కళాకారుల కోసం ఆ భవనం నిర్మిస్తున్నట్లు చెప్పిన విశాల్ తెలిపారు. కళాకారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు తన బృందం పనిచేస్తుందని అన్నారు. వీలైనంత త్వరలోనే భవనాన్ని నిర్మించి ఆ తర్వాతే పెళ్లిచేసుకుంటానని విశాల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో విశాల్ పెళ్లి పై వస్తోన్న వార్తలకు చెక్ పడినట్లైంది.
'లాఠీ' సినిమా గురించి మాట్లాడుతూ.. ఒకసారి ఓ పోలీస్ కానిస్టేబుల్ తనతో మాట్లాడుతూ తనను ఓ మాట అడిగాడని అన్నారు. పోలీసుల్లో అందరి మీద సినిమాలు తీస్తారు కానీ కానిస్టేబుల్స్ మీద ఎందుకు సినిమా తీయరు? అని అడిగాడని చెప్పుకొచ్చారు విశాల్. అప్పుడే తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఈ లాఠీ చిత్రాన్ని పోలీసు కానిస్టేబుల్స్ కు అంకితం చేస్తున్నామని చెప్పారు. విశాల్ నుంచి వస్తోన్న ఈ లేటెస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా విశాల్ కు ఎలాంటి విజయం అందిస్తోందో చూడాలి.