Salman Gets Threat Letter: సింగర్ సిద్ధూని చంపినట్లే నిన్నూ చంపేస్తాం - సల్మాన్‌కు బెదిరింపులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అతడి తండ్రి సలీమ్ ఖాన్ లను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. పంజాబ్ సింగర్ సిద్ధూకి పట్టిన గతే మీకు కూడా పడుతుందని లెటర్ పంపించారు. ఈ లెటర్ తో అప్రమత్తమైన సల్మాన్ ఖాన్.. బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ రోజూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్తారు. ఆ సమయంలో ఒక ప్లేస్ దగ్గర బ్రేక్ తీసుకుంటారు. సలీమ్ ఎక్కడైతే బ్రేక్ తీసుకుంటారో అక్కడే ఓ బెంచ్ మీద ఈ బెదిరింపు లేఖ దొరికింది. అందులో మూస్ వాలాను చంపినట్లే చంపేస్తామన్నట్లుగా రాసి ఉంది. ఈ కేసుపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎంక్వయిరీ చేయడం మొదలుపెట్టారు.
బెదిరింపు లెటర్ ఎవరు పెట్టి ఉంటారని..? స్థానికులను విచారణ చేస్తున్నారు. మరోపక్క సల్మాన్ ఖాన్ కి, అతడి తండ్రికి సెక్యూరిటీ పెంచారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్ సింగర్ సిద్ధూ మూస్ వాలాను తన సొంత విలేజ్ లో చంపేశారు. బిష్ణోయ్ గ్రూప్ సిద్ధూని చంపినట్లుగా వెల్లడించింది. ఇప్పుడు వారే సల్మాన్ ని కూడా బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో కూడా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్ బిష్ణోయ్.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిష్ణోయ్ ముఠా.. సల్మాన్ హత్యకు ప్లాన్ చేశారని.. పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని చెబుతుంటారు.
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆయన 'కభీ ఈద్ కభీ దివాలి' అనే సినిమాను మొదలుపెట్టారు. పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలానే సల్మాన్ ఖాన్ ను 'టైగర్ 3' సినిమాలో చూడబోతున్నారు ప్రేక్షకులు. ఇందులో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: 'మేజర్' సినిమాపై బన్నీ ప్రశంసలు - మహేష్ బాబు రియాక్షన్
Maharashtra | Actor Salman Khan & his father Salim Khan received a threat letter, today. Bandra Police has filed an FIR against an unknown person & further probe is underway: Mumbai Police
— ANI (@ANI) June 5, 2022
(File pic) pic.twitter.com/wAKZlgHNH2