News
News
X

Sourav Ganguly's Biopic: రణ్‌బీర్ కపూర్ హీరోగా క్రికెటర్ సౌరబ్ గంగూలీ బయోపిక్‌?

దిగ్గజ క్రికెటర్ గంగూలీ బయోపిక్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా ఫైనల్ అయినట్లు తెస్తోంది. త్వరలోనే కోల్ కతాకు వెళ్లనున్న ఆయన, ఈడెన్ గార్డెన్స్ తో దాదా ఇంటిని సందర్శించనున్నారు.

FOLLOW US: 
Share:

భారతీయ క్రికెట్ జట్టు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. ఆయన నేతృత్వంలోనే టీమిండియా ప్రపంచ దిగ్గజ టీమ్ గా ఎదిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ క్రెకెట్ ను గంగూలీకి ముందు, ఆ తర్వాతగా విభజించుకోవచ్చు. గంగూలీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టు మైదానంలో చెలరేగిపోయింది. అప్పటి వరకు భారత జట్టు మీద ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయట పడేయడంతో పాటు విదేశాల్లోనూ సత్తా చాటేలా చేశాడు. టీమిండియా తన కెప్టెన్సీ సమయంలో అన్ని విభాగాల్లో మెరుగైన ప్రతిభ కనబర్చింది. ఆయన వేసిన పునాదుల మీదే ఇప్పుడు టీమిండియా విజయతీరాన పరిగెడుతోంది.

రణ్ బీర్ కపూర్ హీరోగా గంగూలీ బయోపిక్  

ప్రస్తుతం గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు స్వయంగా గంగూలీ స్క్రిప్ట్ అందిస్తున్నారట. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇందులో హీరోగా బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ ఫిక్స్ అయ్యారట. త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరో కోసం హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురు హీరోల పేర్లను పరిశీలించారట. చివరకు రణ్ బీర్ ఓకే అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రణ్ బీర్ త్వరలో కోల్ కతాకు వెళ్లనున్నారట. గంగూలీ ఇంటితో పాటు ఈడెన్ గార్డెన్స్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించనున్నారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో విడుదలకానుంది.

గంగూలీ బయోపిక్ పై ఆయన భార్య ఏమన్నారంటే?

వాస్తవానికి గంగూలీ బయోపిక్ మూవీని 2019లో ప్రకటించారు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా గంగూలీ బయోపిక్ పై ఆయన భార్య డోనా గంగూలీ స్పందించారు. ఈ మూవీ గురించి తాను చెప్పడానికి పెద్దగా ఏమీ లేదన్నది. సినిమా ప్రొడ్యూసర్లు, దర్శకుడు స్పందిస్తేనే బాగుంటుందని చెప్పారు. గంగూలీ పాత్రలో ఏ హీరో అయితే బాగుంటుంది? అనే ప్రయత్నకు ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. “నా ఫేవరెట్ అయితే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్. కానీ, వారి వయసు గంగూలీ క్యారెక్టర్ కు సరిపోదు. 24 ఏండ్ల గంగూలీలా కనిపించాల్సి ఉంటుంది. సినిమా చాలా వరకు యంగ్ ఏజ్ లో ఉన్న గంగూలీ చుట్టే తిరుగుతుంది. ఆ వయసుకు తగిన నటుడిని ఎంపిక చేయడం ఉత్తమం” అని తెలిపారు. 

విడుదలకు రెడీ అయిన ‘TJMM’

ఇక రణ్ బీర్ కపూర్ తాజాగా నటించిన ‘తూ జోతి మైన్ మక్కర్’ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది.  లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. రణ్‌ బీర్‌, శ్రద్ధా తొలిసారిగా ఈ చిత్రంతో స్క్రీన్‌ షేర్ చేసుకుంటున్నారు. TJMM హోలీ కానుకగా మార్చిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Read Also: హాలీవుడ్ టాప్ హీరోలకే చెమటలు పట్టిస్తున్న చెర్రీ, తారక్ - ఆ అవార్డుల్లో 2 కేటగిరీల్లో నామినేషన్స్

Published at : 23 Feb 2023 01:51 PM (IST) Tags: Sourav Ganguly Ranbir Kapoor Sourav Gangulys Biopic

సంబంధిత కథనాలు

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

RC15 Welcome: రామ్ చరణ్‌కు RC15 టీమ్ సర్‌ప్రైజ్ - ‘నాటు నాటు’తో ప్రభుదేవ బృందం ఘన స్వాగతం

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

1,540 ఆశా వ‌ర్క‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం అనుమ‌తి, వివరాలు ఇలా!

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్

AP Skill Development: 'స్కిల్' డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి అమర్నాథ్