Jr NTR: ఎన్టీఆర్ కోసం... కుప్పం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర - అభిమానులను కలిసిన తారక్
తన కోసం కుప్పం నుంచి హైదరాబాద్ కు పాదయాత్రగా వచ్చిన అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. కాసేపు వారితో మాట్లాడి యోగ క్షేమాల గురించి ఆరా తీశారు.
Jr NTR Meet Fans Video: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు యూత్ లో మాంచి క్రేజ్ ఉంది. ‘ఆర్ఆర్ఆర్‘ మూవీ తర్వాత ఆయనకు దేశ విదేశాల్లోనూ అభిమానులు ఏర్పడ్డారు. ఎక్కడికి వెళ్లినా ఆయనను కలిసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. తాజాగా ముగ్గురు యువకులు ఆయనను చూసేందుకు ఏకంగా కుప్పం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వచ్చారు. కుప్పం గ్రామ దేవత శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు హరి, లక్ష్మీపతి, కదిరప్ప, శివ హైదరాబాద్ కు పాదయాత్రగా బయల్దేరారు. తాజాగా వాళ్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. నేరుగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు.
అభిమానుల యోగ క్షేమాలు తెలుసుకున్న ఎన్టీఆర్
తన కోసం వందల కిలో మీటర్ల దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన అభిమానులను ఎన్టీఆర్ ప్రత్యేకంగా కలిశారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? హైదరాబాద్ కు వచ్చేందుకు ఎన్ని రోజుల సమయం పట్టింది? అనే విషయాల గురించి ఆరా తీశారు. ఇక ఎన్టీఆర్ ను కలిసిన అభిమానులు చాలా సంతోషంగా ఫీలయ్యారు. తమ అభిమాన నటుడిని కలవడం ఆనందంగా ఉందన్నారు.
This is why he’s the PEOPLE’S HERO ❤️❤️
— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024
MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8
గతంలో 300 కి. మీ చెప్పులు లేకుండా పాదయాత్ర చేసిన ఎన్టీఆర్ అభిమాని
ఇప్పుడే కాదు, గతంలోనూ ఓ అభిమాని ఆయనను కలిసేందుకు ఏకంగా 300 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. ఖమ్మం జిల్లాలోని గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్ర బాబు అనే అభిమాని.. ఖమ్మం నుంచి హైదరాబాద్ కు 300 కిలో మీటర్లు పాటు చెప్పులు లేకుండా పాదయాత్ర చేశారు. కాళ్లకు బొబ్బలు వచ్చినా విశ్రాంతి లేకుండా పాదయాత్రతో హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన ఎన్టీఆర్ ఇంటికి వచ్చే సమయానికి తను ముంబైకి వెళ్లారు. సుమారు 2 వారాల పాటు హైదరాబాద్ లోనే ఎదురు చూసి, చివరకు ఎన్టీఆర్ ను కలిశారు. ఆయనతో ఫోటో దిగి, సంతోషం వ్యక్తం చేశారు. తన అభిమాన నటుడిని కలవడం జీవితాంతం మర్చిపోలేనని చెప్పారు.
‘దేవర’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్
ఇక జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ‘దేవర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా ఆడుతోంది. ఆల్మోస్ట్ 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాగే, 52 కేంద్రాల్లో ఈ సినిమా 50 రోజులుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. రెండు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ చక్కగా నటించి ఆకట్టుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో తంగం పాత్రతో అందం, అభినయంతో ఆకట్టుకుంది. నెగెటివ్ రోల్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’ మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత ‘దేవర 2’లో నటించనున్నారు.
Also Read: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?