అన్వేషించండి

Naga Chaitanya: రేసింగ్ లో బరిలో నాగ చైతన్య టీమ్- హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ కొనుగోలు

Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య స్పోర్ట్స్ రంగంలోకి అడుగు పెట్టాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ 2024లో పోటీపడే హైదరాబాద్ బ్లాక్‌ బర్డ్స్ రేసింగ్ టీమ్‌ ను కొనుగోలు చేశారు.

Naga Chaitanya Joins Indian Racing League: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. తనకు ఎంతో ఇష్టం అయిన రేసింగ్ రంగంలోకి అడుగు పెట్టారు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో బరిలోకి దిగుతున్న హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ప్రాంచైజీని కొనుగోలు చేశారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో జరిగే ఫార్ములా 4లో భాగస్వామిగా మారారు. ఈనెల 24 నుంచి ఈ సీజన్ రేసులు షురూ కానున్నాయి.   

చిన్నప్పటి నుంచే రేసింగ్ పట్ల ఆసక్తి 

నటుడు నాగ చైతన్యకు చిన్నప్పటి నుంచే కారు రేసింగ్స్ అంటే చాలా ఇష్టం. ఫార్ములా వన్ పట్ల బోలెడు ఆసక్తి. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు వెల్లడించారు. అంతేకాదు, తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ కార్లను, మోటార్ బైకులను కొనుగోలు చేస్తుంటారు. వీలుప్పుడు రేసింగ్ లో పాల్గొంటారు. ఇప్పుడు తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్ రంగంలోకి అడుగు పెట్టాడు. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు.    

హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌ ను సొంతం చేసుకోవ‌టం సంతోషంగా ఉంది- నాగ చైతన్య   

కొత్త రంగంలోకి  ఎంట్రీ ఇవ్వడంపై నాగ చైతన్య సంతోషం వ్యక్తం చేశారు. “నాకు చిన్నప్పటి నుంచే రేసింగ్ అంటే చాలా ఇష్టం. ఫార్ములా వన్ అంటే ఎంతో ఆసక్తి. ఫార్ములా వన్ లో హైస్పీడ్ డ్రామా, అతి వేగంగా కార్లు, బైకులు నడపడం ఎంతో థ్రిల్ కలిగిస్తుంది. ఇప్పుడు ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ రేసులో నా టీమ్ కు గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నాను. నాకున్న ఫ్యాషన్ ను ఈ వేదిక ద్వారా చూపించుకునే అవకాశం ఉంది. హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్‌ టీమ్ ను సొంతం చేసుకోవ‌టం సంతోషంగా ఉంది. అభిమానులకు ఐఆర్ఎఫ్ మంచి థ్రిల్ కలిగిస్తుందని భావిస్తున్నాను. ఈ రేస్ తో ఇండియ‌న్ మోటార్ స్పోర్ట్స్ మరో లెవల్ కు చేరుకుంటుదని భావిస్తున్నాను. కొత్త ట్యాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంది” అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Indian Racing League Official (@indianracingleagueofficial)

ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌లో 6 జట్లు పోటీ

ఇండియ‌న్ రేసింగ్ లీగ్‌ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. వాటిలో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్ ఒక‌టి. మిగతా టీమ్ లకు అర్జున్ క‌పూర్‌, జాన్ అబ్ర‌హం, టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌భ్ గంగూలీ ఓనర్లుగా ఉన్నారు.    

‘తండేల్’ మూవీ షూటింగ్ లో నాగ చైతన్య

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో బన్నీ వాసు   నిర్మిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.  సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.

Also Read: మీరు ఏమైనా అనుకోండి... నాకు ఇష్టమైతే, నా మనసుకు నచ్చితే వెళ్తా... వైసీపీ క్యాండిడేట్‌కు సపోర్ట్ - నంద్యాల ఎపిసోడ్‌ మీద పవన్, నాగబాబుకు బన్నీ కౌంటర్?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget