By: ABP Desam | Updated at : 27 Feb 2023 04:40 PM (IST)
Edited By: Mani kumar
Image Credit:Chiranjeevi/Twitter
కేంద్ర సమాచార, క్రీడా శాఖల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల హైదరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పర్యటనల్లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. అక్కడ చిరంజీవి, అల్లు అరవింద్, అక్కినేని నాగార్జునలతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత చలన చిత్ర పరిశ్రమ గురించి పలు విషయాలను చర్చించారు. ఈ భేటీకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తన నివాసానికి విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ సాధిస్తోన్న పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలసి ఆయనతో చర్చించడం సంతోషంగా ఉందన్నారు. తమ కోసం సమయం కేటాయించినందుకు మంత్రి అనురాగ్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. "ప్రియమైన అనురాగ్ ఠాగుర్ కు ధన్యవాదాలు. నిన్న మీ హైదరాబాద్ పర్యటనలో నా దగ్గరికి రావడానికి సమయం కేటాయించినందుకు. నా సోదరుడితో నాగార్జునతో కలిసి భారతీయ చలనచిత్ర పరిశ్రమ, అది వేగవంతమైన పురోగతి గురించి చర్చించడం నచ్చింది" అని చిరంజీవి ట్వీట్ చేశారు.
అయితే మరోవైపు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిరంజీవిని కలవడం వెనుక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి బీజేపీతో కలసి పనిచేయడానికి కేంద్ర మంత్రి ద్వారా ఆహ్వానించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలం లేదనే వాదనలు కూడా లేకపోలేదు. మరోవైపు ఈ చర్చలో హీరో నాగార్జున కూడా ఉండటం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నాగార్జున రాయకీయాలకు దూరంగా ఉంటారు. కానీ ఆయన మొదటినుంచీ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. గతంలో కూడా హీరో నాగార్జున ప్రధాన మోడీ ఒకరికొకరు ట్వీట్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటనలో భాగంగా చిరంజీవి నివాసానికి వచ్చినపుడు ఆ చర్చలో నాగార్జున కూడా ఉండటం చర్చనీయాంశమైంది. ఏదేమైనా కేంద్ర మంత్రి చిరంజీవి ఇంటికి వచ్చి సినిమా పరిశ్రమ గురించి చర్చించడం శుభపరిణామమే అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే ఈ చర్చలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు అనే విషయాలు ఏమీ బయటకు రాలేదు. అల్లు అరవింద్ మాత్రం ఫోటోలో కనిపిస్తున్నారు. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ప్రస్తుతం చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నారు. ఈ ఏడాాది ప్రారంభంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు చిరు. ఈ సినిమా జనవరి 13న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ సినిమాగా నిలిచింది. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘వాల్తేరు వీరయ్య’ రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ మూవీ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
Thank you dear Sri @ianuragthakur for making time to drop by at my place on your visit to Hyderabad yesterday.
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023
Loved the delightful discussion we had along with my brother @iamnagarjuna
about the Indian Film Industry and the rapid strides it is making! pic.twitter.com/Bm6bjvHT39
Ajith Kumar: అజిత్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించిన విజయ్ - పోటీ బాక్సాఫీస్ దగ్గరే, పర్సనల్ లైఫ్‌లో కాదు!
Akshay Kumar: మూవీ షూటింగ్లో గాయపడ్డ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
New Music Directors in Tollywood: సరికొత్త ట్యూన్స్‌తో అదరగొడుతున్న చిన్న సంగీత దర్శకులు - ఒక్క ఛాన్స్ ఇవ్వండి గురూ!
Nikhil Wife Pallavi Varma: సాడ్ స్టోరీలు చెప్పి నన్ను పడేశాడు: నిఖిల్ భార్య పల్లవి
Jabardasth: పానకం కోసం గొడవపడ్డ ‘జబర్దస్త్’ టీమ్, యాంకర్ సౌమ్యపై ఇంద్రజ ఆగ్రహం
YSRCP Reverse : దెబ్బ మీద దెబ్బ - వ్యూహాత్మక తప్పిదాలే వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తున్నాయా ?
MIW Vs UPW Highlights: యూపీని ఎలిమినేటర్‌లోనే ఆపేసిన ముంబై - 72 పరుగుల విజయంతో ఫైనల్లోకి ఎంట్రీ!
AP Cag Report : 13.99 శాతం వడ్డీకి అప్పులు తెస్తున్న ఏపీ సర్కార్ - కాగ్ రిపోర్టులో సంచలన విషయాలు
రైతులపై కేసీఆర్ ది ఎన్నికల ప్రేమ, మీరిచ్చే రూ.10 వేలు ఏ మూలకు సరిపోతాయి - వైఎస్ షర్మిల