News
News
X

Aadhi Pinisetty - Nikki Galrani: గుడ్ న్యూస్ చెప్పనున్న ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ?

ఆది పినిశెట్టి తన ప్రేయసి నిక్కీ గల్రానీ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట ?

FOLLOW US: 
 
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగు ప్రేక్షకులు అందరికీ ఆది సుపరిచితమే. ఒకప్పటి స్టార్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. ఆది తమిళ నటుడే అయినా ఆయనకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆది పినిశెట్టి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది లో ఆది పినిశెట్టి తన ప్రేయసి నిక్కీ గల్రానీ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది.

నిక్కీ గల్రానీ ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ చెల్లెలు అన్న సంగతి తెలిసిందే. అయితే ‘మలుపు’ సినిమాలో ఆది-నిక్కీ కలసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పట్లో వీరి ప్రేమాయణం పై సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి కూడా. కొన్నాళ్ళు ప్రేమించుకొని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఇరువురి పెద్దలను ఒప్పించి మే 18, 2022న కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యింది ఈ జంట. వీరి పెళ్లిలో హీరో నాని, సందీప్ కిషన్ లు సందడి  చేశారు కూడా. ప్రస్తుతం ఆది-నిక్కీ లు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సర్కులేట్ అవుతోంది. ఆది తండ్రి అవుతున్నారని వార్తలు రావడంతో ఆయన ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆది-నిక్కీ జంట అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?

ఆది పినిశెట్టి ఫ్యామిలీ తమిళనాడులో సెటిల్ అయినా వీరు తెలుగువాళ్లే అన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది. అందుకే ఆదికు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఆయన చాలా టాలీవుడ్ సినిమాల్లో నటించాడు కూడా. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు ఆది. ‘ఒక వి చిత్రం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు తెలుగులో గ్యాప్ ఇచ్చారు ఆది. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు. ‘వైశాలి’ సినిమా ఆదికు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇక్కడ కూడా కమర్షియల్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత 'ఏకవీర', 'గుండెల్లో గోదారి' వంటి సినిమాలు ఆయనలో విలక్షణ నటుడ్ని పరిచయం చేశాయి. 'మలుపు', 'మరకతమణి' లాంటి సినిమాలు తెలుగులోనూ ఆకట్టుకున్నాయి. తర్వాత అల్లు అర్జున్ హీరోగా చేసిన 'సరైనోడు' సినిమాలో విలన్ గా చేసి మంచి మార్కులు కొట్టేశాడు ఆది. ఇక 'రంగస్థలం' సినిమాలో కుమార్ బాబుగా ఆది చేసిన నటనతో ఆయనకు వంద శాతం మార్కులు పడ్డాయి. తర్వాత ‘నీవెవరో’ ‘అజ్ఞాతవాసి’ ‘యూటర్న్’ ‘ది వారియర్’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు ఆది.

News Reels

Published at : 17 Nov 2022 01:11 PM (IST) Tags: Aadhi Pinisetty Nikki Galrani Aadhi-Nikki

సంబంధిత కథనాలు

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Pushpa 2 In Russia : రష్యాలో 'పుష్ప 2' కూడా - లేట్ లేకుండా నయా ప్లాన్!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Varasudu Song : శింబుకు థాంక్స్ చెప్పిన 'వారసుడు' టీమ్ - థీ దళపతి

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

Korameenu Release Date : 'అవతార్ 2'కు ఒక్క రోజు ముందు 'కోరమీను' - ఆనంద్ రవి ధైర్యం ఏమిటి?

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

నేవీ డే అంటే ఏమిటీ -యాక్షన్ సినిమా తలదన్నే దాని చరిత్ర తెలుసా ?

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.

క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న దీపికా పిల్లి.