అన్వేషించండి

Geeta Sakshigaa Teaser : జైలు గోడల మధ్య అర్జునుడు - సిక్స్ ప్యాక్ బాడీతో ఫైట్

తెలుగు తెరకు మరో సిక్స్ ప్యాక్ హీరో వస్తున్నాడు. అతడి పేరు ఆదర్శ్. ఆయన హీరోగా నటించిన సినిమా 'గీత సాక్షిగా'. ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు. 

చిత్రా శుక్లా (Chitra Shukla), ఆదర్శ్, రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'గీత సాక్షిగా' (Geeta Sakshigaa Movie). చేతన్ రాజ్ కథ అందించడంతో పాటు చేతన్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సినిమా టీజర్ విడుదల చేశారు.

'గీత సాక్షిగా' సినిమాలో ఎవరి క్యారెక్టర్లు ఏంటి?
'గీత సాక్షిగా' సినిమాలో ఆదర్శ్ జైలులో ఖైదీగా కనిపించనున్నారు. అతని తరపున వాదించే న్యాయవాది పాత్రలో చిత్రా శుక్లా, ఆమెకు ప్రత్యర్థి న్యాయవాదిగా శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు.

టీజర్‌లో ఏముంది?
'గీత సాక్షిగా' టీజర్ విషయానికి వస్తే... ఆదర్శ్‌ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకు వెళ్లడం, అతని కోసం చిత్రా శుక్లా జైలుకు వెళితే... ముఖం మీద ఒకరు ఇంక్ పోయడం వంటివి టీజర్‌లో చూడవచ్చు. జైలులో కొంత మంది ఎటాక్ చేయబోతే... అందరినీ చితక్కొట్టిన ఆదర్శ్... 'పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి నేను అభిమన్యుడిని కాదు, వాడి బాబు అర్జునుడిని రా' అంటూ చెప్పిన డైలాగ్, ఆయన సిక్స్ ప్యాక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాపై ఆసక్తి పెంచాయి. 

వాస్తవ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. కంటెంట్ బేస్డ్ చిత్రమిదని వారు పేర్కొన్నారు. ఒక చిన్నారి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. చిన్నారిని ఎవరో పట్టుకోవాలని ప్రయత్నించడం, ఆ పెద్దల నుంచి తప్పించుకోవడానికి చిన్నారి వేసే అడుగులు ఆసక్తిగా ఉంటాయట.
 
శ్రీ విష్ణు 'మా అబ్బాయి', రాజ్ తరుణ్ 'రంగుల రాట్నం', శ్రీ సింహా కోడూరి 'తెల్లవారితే గురువారం', 'అల్లరి' నరేష్ 'సిల్లీ ఫెలోస్' సినిమాల తర్వాత తెలుగులో చిత్రా శుక్లా నటిస్తున్న చిత్రమిది. ఇటీవల విడుదలైన గోపీచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలో ఆమె అతిథి పాత్రలో నటించారు. సినిమా ప్రారంభంలో ఆత్మహత్య చేసుకునే అమ్మాయిగా కనిపించారు. ఆమె 'ఉనికి' అని మరో సినిమా కూడా చేస్తున్నారు.

Also Read : 'బబ్లీ బౌన్సర్' రివ్యూ : తమన్నా బబ్లీగా ఉన్నారా? బౌన్సర్‌గా ఇరగదీశారా? సినిమా ఎలా ఉందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్', 'అల్లరి' నరేష్ 'నాంది'... గత ఏడాది రెండు కోర్ట్ రూమ్ డ్రామాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండూ మంచి విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఆ కోవలో వస్తున్న మరో సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా 'గీత సాక్షిగా' అని చెప్పవచ్చు. 

భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేష్, అనిత చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ ఐఏఎస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు గోపీసుందర్ (Gopi Sundar Music Director) స్వరాలు, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ హనుమ, ఎడిటర్: కిశోర్ మద్దాలి, సాహిత్యం: రెహమాన్, కళ: నాని, నృత్యం : యశ్వంత్ - అనీష్, ఫైట్స్ : పృథ్వీ.

Also Read : 'కృష్ణ వ్రింద విహారి' రివ్యూ : నాగశౌర్య నయా సినిమా ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget