Adipurush: హనుమంతుడి వేషంలో థియేటర్‌కు వెళ్లిన అభిమాని, ఆ సీటే కావాలని పట్టు - వీడియో వైరల్!
‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శన సమయంలో ప్రతీ థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ఫ్రీ సీటు కోసం ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడి వేషం వేసుకొని థియేటర్ కు వచ్చేశాడు...
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా నేడు(జూన్ 16) న గ్రాండ్ గా విడుదల అయింది. ఈ రోజు తెల్లవారుజామునుంచే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత మూవీ గురించి రకరకాల ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతీ థియేటర్లో హనుమంతుడి కోసం ఓ సీట్ ను కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోరిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే థియేటర్ లలో ఒక సీటును ఖాళీగా వదిలేశారు. ఇప్పుడు ఈ విషయాన్ని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఖాళీగా ఉన్న హనుమంతుడి సీటు కోసం ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడి వేషం వేసుకొని థియేటర్ కు వెళ్లాడు. కొంతమంది దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఫ్రీ సీటు కోసం హనుమంతుడి వేషంలో..
‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శన సమయంలో ప్రతీ థియేటర్లో హనుమంతుడి కోసం ఒక సీటును కేటాయించిన విషయం తెలిసిందే. ఆ ఫ్రీ సీటు కోసం ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడి వేషం వేసుకొని థియేటర్ కు వచ్చేశాడు. ఇదేంటి ఇలా వచ్చావ్ అని అక్కడున్న ప్రేక్షకులు అడిగితే.. హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారు కదా అందుకే ఆయన వేషంలో వచ్చాను అన్నాడు. థియేటర్ వాళ్లని అడుగుతున్నానని, తన సీటు నెంబర్ ఎక్కడో చెప్తే వెళ్లి సినిమా చూస్తానని బదులిచ్చాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘ఇలా కూడా ఆలోచిస్తారా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
హనుమాన్ సీటుల్లో విగ్రహాలు, పూజలు..
‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టికెట్ ల విక్రయాల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ కోసం ఉంచిన సీటు గురించి సోషల్ మీడియాలో వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చాలా థియేటర్లలో హనుమాన్ కోసం ఉంచిన సీటులో హనుమంతుడి ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచుతున్నారు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. హనుమాన్ సీటులో హనుమంతుడు బొమ్మ ఉన్న ఒక టవల్ లాంటి క్లాత్ ను ఉంచి అక్కడ పూలు అరటి పండ్లు పెట్టి పూజులు చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇలా చాలా వీడియోలు వచ్చాయి. తర్వాత ఓ థియేటర్ లోకి ఒక వానరం వచ్చి కాసేసు అటు ఇటు చూసి వెళ్లిపోయిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు హనుమంతుడి కోసం కేటాయించిన సీటు కోసం ఓ వ్యక్తి హనుమాన్ వేషంలో వచ్చి ఫ్రీ సీటు కావాలి అని చెప్పుకొచ్చాడు. ఇలా చాలా వీడియోలు హనుమంతుడి ఖాళీ సీటు గురించి పోస్ట్ లు పెడుతూ షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా ఇలాంటి ఫోటోలు వీడియోలు ఇంకెన్ని వస్తాయో దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.
#Adipurush antey hanuman ki oka seat kali ani getup esikoni thenkochha pic.twitter.com/De8bhhyjYH
— scarecrow (@Antharmukudu67) June 16, 2023