National Film Awards 2024: కార్తికేయ - 2 చిత్రానికి జాతీయ అవార్డు, ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి - నేషనల్ అవార్డుల మొత్తం లిస్ట్ ఇదే
National Film Awards 2024: కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2కి అవార్డు అందించింది.
National Film Awards 2024 Full List: కేంద్ర ప్రభుత్వం 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డులు (2022) ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2ని ప్రకటించింది. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్-2 నిలిచింది. ఉత్తమ హిందీ చిత్రంగా గుల్‌మొహర్ చిత్రానికి అవార్డు ప్రకటించింది. 2022 లో విడుదలైన చిత్రాలకు కేంద్రం ఈ అవార్డులు (national awards 2024 winners list) ప్రకటించింది. బెస్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా కేజీఎఫ్-2 కి అవార్డు అందించింది. ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్, మానసి పరేఖ్ నిలిచారు. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ఎంపికయ్యారు. తిరు చిత్రంలోని పాటకు ఆయనకు ఈ అవార్డు లభించింది. గుల్‌మొహర్ చిత్రంలో నటించిన మనోజ్ బాజ్‌పేయీకి స్పెషల్ మెన్షన్ అవార్డు ప్రకటించారు జ్యూరీ సభ్యులు. ఉత్తమ తమిళ చిత్రంగా పొన్నియన్ సెల్వన్-1 అవార్డు దక్కించుకుంది. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రహమాన్ పేరుని ప్రకటించింది. కాంతారాలో నటనకు గానూ రిషబ్ షెట్టికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కింది.
ఫుల్ లిస్ట్ ఇదే..
ఉత్తమ తెలుగు చిత్రం - కార్తికేయ-2
ఉత్తమ తమిళ చిత్రం - పొన్నియన్ సెల్వన్ (పార్ట్ 1)
ఉత్తమ హిందీ చిత్రం - గుల్‌మొహర్
ఉత్తమ కన్నడ చిత్రం - కేజీఎఫ్ -2
ఉత్తమ సంగీత దర్శకుడు - ప్రీతమ్ (పాటలు), ఏఆర్ రెహమాన్ (బ్యాగ్రౌండ్ స్కోర్)
ఉత్తమ మలయాళ చిత్రం - సౌదీ వెలక్క
ఉత్తమ పంజాబీ చిత్రం - బాగీ దీ ధీ (Baaghi Di Dhee)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - ఆట్టం (మలయాళం)
ఉత్తమ నటుడు - రిషబ్ శెట్టి (కాంతారా)
ఉత్తమ నటీమణులు - నిత్యమీనన్ (తిరుచిత్రంబలం), మానసీ పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్)
ఉత్తమ దర్శకుడు - సూరజ్ బర్జాత్యా (ఉంఛాయ్)
ఉత్తమ సహాయ నటి - నీనా గుప్తా (ఉంఛాయ్)
70th National Film Awards for the Year 2022 Announced!📽️
— PIB India (@PIB_India) August 16, 2024
Best Actress in a Leading Role (Feature Films) goes to:
1. Nithya Menen for film Thiruchitrambalam (Tamil) &
2. Manasi Parekh for the film Kutch Express (Gujarati)
Best Actor in a Leading Role (Feature Films) goes to:… pic.twitter.com/r6L1lQczjh
కేజీఎఫ్- ఛాప్టర్ 2 చిత్రం బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు కూడా దక్కించుకుంది. బ్రహ్మాస్త్రలోని కేసరియా పాటకు సింగర్ అరిజిత్ సింగ్‌కి నేషనల్ అవార్డు దక్కింది. సౌదీవెలక్క (మలయాళం) చిత్రానికి గానూ బాంబే జయశ్రీ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా అవార్డు సొంతం చేసుకున్నారు. పొన్నియన్ సెల్వన్‌ని ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా వచ్చింది. సినిమాటోగ్రాఫర్ రవివర్మన్‌కి ఈ పురస్కారం ప్రకటించింది. ఇదే చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన ఆనంద్ కృష్ణమూర్తికీ అవార్డు ప్రకటించింది జ్యూరీ.
స్పెషల్ మెన్షన్ అవార్డులు
ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు సొంతం చేసుకున్న గుల్‌మొహర్‌లో మనోజ్ బాజ్‌పేయీ నటనకు స్పెషల్ మెన్షన్ అవార్డు ప్రకటించింది జ్యూరీ. మలయాళ చిత్రం కధికన్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సంజయ్ సెయిల్ చౌదురికీ స్పెషల్ మెన్షన్ అవార్డు ఇచ్చింది.
నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో రెండు అసోం చిత్రాలకు స్పెషల్ మెన్షన్ అవార్డులు లభించాయి. బిరుబాలా, హర్గిలా చిత్రాలకు ఈ పురస్కారాలు అందాయి.