(Source: ECI/ABP News/ABP Majha)
21 ఏళ్లు, 60 శుక్రవారాలు - ఇదంతా మీ వల్లే సాధ్యం: అల్లరి నరేష్ ఎమోషనల్ నోట్
కామెడీ సినిమాలతో కెరీర్ ప్రారంభించిన అల్లరి నరేష్.. నేడు వైవిధ్య పాత్రల్లోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. నేటితో ఆయన ఇండస్ట్రీకి వచ్చి 21 ఏళ్లు అవుతున్నందున అభిమానుల కోసం ఓ ఎమోషనల్ నోట్ వదిలాడు.
Allari Naresh : 'అల్లరి' సినిమాతో నటుడు నరేష్ 2002లో తెలుగు సినీ పరిశ్రమకు కు పరిచమయ్యారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకురావడంతో ఆ మూవీ పేరే నరేష్ కు ఇంటి పేరుగా మారి అల్లరి నరేష్ గా స్థిరపడిపోయాడు. అలా యాక్షన్, మాస్ లాంటి చిత్రాల్లో నటించి నరేష్ ఎంటర్టైన్ చేశారు. మే 10తో ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఆయన ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. తరాలు మారినా ప్రేమ మాత్రం తగ్గలేదని నరేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
తెలుగు సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండో కుమారుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అల్లరి నరేష్.. హాస్య ప్రధానమైన చిత్రాలకు కేరాఫ్ మారారు. ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందారు కూడా. ఇటీవలి కాలంలో అన్ని రకాల పాత్రలు పోషిస్తూ.. అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'గమ్యం' చిత్రంలో గాలి శీను పాత్ర, 'శంభో శివ శంభో' సినిమాలో మల్లి పాత్ర నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలుగా చెప్పవచ్చు. అంతే కాదు 'గమ్యం' సినిమాలో ఆయన నటనకు గానూ.. 2008లో ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఫిల్మ్ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 2009లో 'మహర్షి' సినిమాలో ఉత్తమ సహాయనటుడి కేటగిరీలో సైమా అవార్డును దక్కించుకున్నారు.
ఆ తర్వాత ఇటీవలి కాలంలో డైరెక్టర్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన 'నాంది' సూపర్ హిట్ అయింది. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ ను మరో మలుపు తిప్పిందనే చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా మరోసారి విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఆయన 'ఉగ్రం' మూవీలో నటించారు. మే 5న రిలీజైన ఈ మూవీకి.. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ముందుగా రిలీజైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్.. మూవీపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. కానీ విడుదల తర్వాత వచ్చిన కలెక్ట్ అయిన వసూళ్లు మాత్రం ఊహించినంత రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అలా ఆయన ఇప్పటివరకు దాదాపు 60 సినిమాలు నటించి, తనకంటూ ఓ పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
Also Read : బన్నీతో ఫోటో మాత్రమే, 'పుష్ప 2'లో సీరత్ ఐటమ్ లేదు!
మే 10తో సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 21 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్.. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "21 సంవత్సరాలు.. 60 శుక్రవారాలు.. లెక్కలేనన్ని ప్రశంసలు.. తరాలు మారినా ప్రేమ ఎప్పుడూ మారలేదు. పాలో కొయెల్హో చెప్పినట్లుగా, ఓడరేవులో ఉన్నప్పుడు ఓడ సురక్షితంగా ఉంటుంది. కానీ దాని కోసం ఓడలు నిర్మించబడలేదు కదా. అలాగే నా ఈ ప్రయాణంలో లోతుల్లోకి ప్రయాణించేందుకు, కొత్త తరాలను అన్వేషించేందుకు, నా సరిహద్దులను ముందుకు తీసుకెళ్లేందుకు.. మీరు నన్ను ప్రతిసారీ ముక్తకంఠంతో స్వీకరిస్తూనే ఉన్నారు. కాబట్టి నేను ఏమైనా చేయగలిగానంటే అదంతా మీ ఆశీర్వదాల వల్లే. నన్ను మీ కుటుంబంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు.." అంటూ అల్లరి నరేష్ ఓ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు.
View this post on Instagram