18 Pages Movie Update: నిఖిల్ '18 పేజెస్' నుంచి బిగ్ అప్డేట్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ రీసెంట్ గా నటిస్తోన్న సినిమా ' 18 పేజెస్'. కార్తికేయ 2 లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత నటుడు నిఖిల్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి.
![18 Pages Movie Update: నిఖిల్ '18 పేజెస్' నుంచి బిగ్ అప్డేట్ 1st Single Nannaya Raasina from anupama parameswaran Nikhil Siddharth's 18 Pages will be out on Nov 22nd 18 Pages Movie Update: నిఖిల్ '18 పేజెస్' నుంచి బిగ్ అప్డేట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/18/a47fab4b60c91672462544ba66edbd4f1668757890547592_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన '18 పేజెస్' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ‘కార్తికేయ 2’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత నటుడు నిఖిల్ నటిస్తోన్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. 'కుమారి 21F' సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. మూవీలో 'నన్నయ రాసిన' అనే లైన్ తో ఫస్ట్ సింగిల్ సాంగ్ ను నవెంబర్ 22న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
'హ్యాపీ డేస్' సినిమాతో హీరో నిఖిల్ కు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత వరుసగా సినిమాలు చేసినా సరైన హిట్ మాత్రం రాలేదు. తర్వాత 2013 లో వచ్చిన 'స్వామి రారా' సినిమాతో నిఖిల్ కెరీర్ మళ్ళీ గాడిన పడింది. ఈ సినిమా తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' సినిమా నిఖిల్ స్టార్ డమ్ ను మరింత పెంచింది. ఆ మూవీ భారీ హిట్ అవ్వడంతో మళ్ళీ అదే కాంబోలో 'కార్తికేయ 2'ను తెరకెక్కించారు. ఈ సినిమా సైలెంట్ గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. హిందీ లో కూడా ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. దేశవ్యాప్తంగా దాదాపు 120 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది. దీంతో హీరో నిఖిల్ కు దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. 'కార్తికేయ 2' లాంటి భారీ హిట్ తర్వాత నిఖిల్ నుంచి వస్తోన్న సినిమా కాబట్టి '18 పేజెస్' పై ఆసక్తి నెలకొంది.
'18 పేజెస్' సినిమాలో హీరో నిఖిల్ కు జోడీగా అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది. 'కార్తికేయ 2'లో నిఖిల్ తో కలసి నటించిన అనుపమా.. ఈ సినిమాలో కూడా నిఖిల్ తో జతకట్టనుంది. ‘కార్తికేయ 2’లో వీరిద్దరి జంట ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు '18 పేజెస్' చిత్రంపై బజ్ పెరిగింది. ఈ సినిమా కథ ఏంటి, ఎలాంటి జోనర్ లో తీశారు అని సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పరణలో జియో 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ లపై ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక '18 పేజెస్' చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కి పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో అంతకంటే ముందే క్రిస్మస్ కు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో '18 పేజెస్' తో పాటు మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ధమాకా' డిసెంబర్ 23 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'అన్నీ మంచి శకునములే' సినిమా డిసెంబర్ 21న రిలీజ్ కాబోతుంది. అలాగే తమిళ్ నటుడు విశాల్ నటించిన 'లాఠీ' సినిమా కూడా డిసెంబర్ 22 న విడుదల కాబోతోంది. మరి ఈ పోటీని తట్టుకొని '18 పేజెస్' ఎలా నిలబడుతుందో లేదో చూడాలి.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)